తెలంగాణ బిజెపిలో కీలక నేతగా ఉన్న ఎంపీ ఈటెల రాజేందర్( MP Etela Rajender ) ఇప్పుడు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించి, కెసిఆర్ కు అత్యంత సన్నిహితుడుగా పేరుపొందిన రాజేందర్ రెండోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కెసిఆర్ తో విభేదాలు ఏర్పడ్డాయి.
దీంతో రాజేందర్ ను మంత్రివర్గం నుంచి బహిష్కరించారు. ఆ తర్వాత ఎమ్మెల్యేకి , పార్టీ పదవులకు రాజేందర్ రాజీనామా చేసి హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.
ఆ తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ( Assembly elections )పోటీ చేసి ఓటమి చెందారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు .కేంద్రంలో బిజెపి కూడా అధికారంలోకి రావడంతో తనకు మంత్రి పదవి గ్యారెంటీ అని రాజేందర్ ఆశలు పెట్టుకున్నారు .అయితే బిజెపి అధిష్టానం మాత్రం రాజేందర్ ను పక్కనపెట్టి తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డికి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్( MP Bandi Sanjay ) కు కేంద్రమంత్రి పదవులు ఇచ్చింది.

అప్పటి నుంచి రాజేందర్ అసంతృప్తితోనే ఉంటున్నారు.ఇక మంత్రి పదవి దక్కకపోయినా, కనీసం తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవి అయిన తనకు కేటాయించాలని రాజేందర్ అధిష్టానం పెద్దలపై ఒత్తిడి చేస్తున్నారట.అయితే అదే పదవి పై డికె అరుణ , ధర్మపురి అరవింద్( DK Aruna, Dharmapuri Arvind ) లు కన్నేసారు. వీరిద్దరి పేర్లను అధిష్టానం కూడా పరిశీలిస్తుంది .దీంతో రాజేందర్ ఈ విషయంలోనూ అసంతృప్తి చెందుతున్నారట.సందర్భం వచ్చినప్పుడల్లా పరోక్షంగా స్పందిస్తున్నారు.
బిజెపి అధ్యక్షుడిగా ఏ ఫైటర్ కావాలి. స్ట్రీట్ ఫైటర్ నా, రియల్ ఫైటర్ నా అంటూ రాజేందర్ వ్యాఖ్యానిస్తున్నారు .

ఐదుగురు ముఖ్యమంత్రిలతో తాను కొట్లాడానంటూ తనకు తానే గొప్ప చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు .సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలాన్ని కొట్టే దమ్మున్నోడు కావాలని, గల్లీలో కొట్లాడేవాళ్లు కాదని రాజేందర్ వ్యాఖ్యానిస్తున్నారు.ఈ వ్యాఖ్యలతో రాజేందర్ మంత్రి పదవి విషయంలోనూ, పార్టీ పదవి విషయంలోనూ అసంతృప్తితో ఉన్నట్లుగా అర్థమవుతుంది.







