ప్రపంచంలో ప్రతిరోజు ఏదో ఒక ఘ్తనకు సంబంధించిన విశేషం బయటకు వస్తూనే ఉంటుంది.ప్రస్తుతం సోషల్ మీడియా ఎక్కువగా వాడుతున్న నేపథ్యంలో ప్రతి విషయం ప్రపంచవ్యాప్తంగా ఇట్లే తెలిసిపోతుంది.
ఇకపోతే ఓ ఇంట్లో కొడుకు, కోడలు, మనవళ్లతో కలిసి హాయిగా కాలం గడిపేస్తున్నారు ఓ వృద్ధ జంట.( Elderly Couple ) అయితే రాత్రి అయ్యేసరికి ఆ ఇంట్లో వింత వింత శబ్దాలు వినబడుతున్నాయి.వాటిని పెద్దవాళ్లు వినినా కానీ పెద్దగా పట్టించుకోలేదు.అయితే పిల్లలు మాత్రం ఊరికే ఉండలేకపోయారు.దాంతో వారు భయభయంగాను గడిపేస్తూ ఉండేవారు.అయితే ఆ విషయాన్ని పిల్లలు తాతకు తెలపడంతో ఆ శబ్దంఏంటో తెలుద్దామని అతను ఫిక్స్ అయ్యాడు.

దీంతో అతను ఇంటి పై కప్పు( House Ceiling ) నుండి శబ్దం రావడాన్నీ బాగా గమనించాడు.అంతేకాకుండా అప్పుడప్పుడు తన ఇంట్లో అక్కడక్కడా తేనెటీగలు( Honey Bees ) ఉండడం గమనించాడు.దాంతో అతనికి వారి ఇంటి నివాసంలో సీలింగ్ లో తేనెటీగలు నివాసం ఏమైనా ఏర్పరచుకున్నాయేమో అని అనుమానం వచ్చింది.దాంతో వెంటనే లోచ్ నెస్ అనే సంస్థకు ఆయన సమాచారం అందించాడు.
దాంతో ఆ కంపెనీకి చెందిన ఓ వ్యక్తి అక్కడికి చేరుకొని తన థర్మల్ ఇమేజింగ్ సెన్సింగ్ కెమెరా సహాయంతో ప్లాస్టర్ బోర్డు కింద ఏముందో అని పరిశీలించాడు.అయితే అక్కడ పరిస్థితిని చూసి అతడు ఒక్కసారిగా భయపడిపోయాడు.

అక్కడ ఇంటి పైకప్పులో ఏకంగా 1,80,000 తేనెటీగలు స్థావరాన్ని ఏర్పరచుకున్నట్లు అతను తెలియజేశాడు.దీంతో ఇంట్లోని వారందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.ఆ తేనెటీగలు దాదాపు 40 వేల లీటర్ల తేనెను ఏర్పరచగలవని ఆ తేనెటీగల సంస్థ వ్యక్తి తెలిపాడు.ఈ ఘటనకు సంబంధించిన వీడియోని సదరు తేనెటీగల సంస్థ సంబంధించిన వ్యక్తి తన తేనెటీగల సంస్థ సంబంధించిన వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.దీనిని చూసిన నెటిజన్స్.వామ్మో., ఇంత పెద్ద తేనెటీగల పుట్ట ఇంట్లో ఉండి ఎలా జీవిస్తున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు.