చాలాకాలం జైలు జీవితం గడిపిన నేరస్తుల గురించి మీకు తెలిసే ఉంటుంది.కానీ, ఏకంగా 50 సంవత్సరాలు ఒంటరి నిర్బంధంలో ఉన్న ఖైదీ గురించి మీకు తెలుసా? అతనే బ్రిటన్‌లో అత్యధిక కాలం ఒంటరి నిర్బంధంలో ఉన్న ఖైదీ – రాబర్ట్ మాడ్స్లీ.
బ్రిటన్‌లో అత్యంత ప్రమాదకరమైన సీరియల్ కిల్లర్‌గా రాబర్ట్ మాడ్స్లీ చెడ్డ పేరు తెచ్చుకున్నాడు.ప్రస్తుతం అతడు వేక్ఫీల్డ్ జైలులో ఉన్నాడు.అతని జైలు గది 18 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పు ఉండి, 17 ఉక్కు తలుపుల వెనుక ఉంటుంది.ఈ గది కాల్పులు తట్టుకునేంత బలంగా కూడా ఉంటుంది.“ఇన్సైడ్ వేక్ఫీల్డ్ ప్రిజన్” అనే పుస్తకంలో జోనాథన్ లెవి, ఎమ్మా ఫ్రెంచ్‌లు రాసినట్లుగా, మాడ్స్లీ జైలు గదిలోని టేబుల్, కుర్చీలు కార్డ్‌బోర్డ్‌తో తయారు చేశారు.టాయిలెట్, సింక్ నేలకు బిగించబడి ఉంటాయి.
అతనికి భోజనం డోర్ కింద ఒక చిన్న రంధ్రం ద్వారా అందిస్తారు.
మాడ్స్లీ 21 సంవత్సరాల( Robert Maudsley ) వయసు నుండి జైలు జీవితం గడిపిస్తున్నాడు.అతని నేరాలు చూసి, అతను నేరస్థుడా లేక రక్షకుడా అని ప్రజలు ఆలోచిస్తుంటారు.1974లో, చిన్న పిల్లలపై లైంగిక దాడి చేసిన 30 సంవత్సరాల వ్యక్తి జాన్ ఫారెల్ని అతను చంపేశాడు.ఆ తర్వాత 1977లో, అతను మరో ఖైదీతో కలిసి, చిన్నపిల్లలపై లైంగిక దాడి నేరానికి జైలు శిక్ష అనుభవిస్తున్న డేవిడ్ ఫ్రాన్సిస్( David Francis )ని చంపేశాడు.వేక్ఫీల్డ్ జైలులో కూడా మాడ్స్లీ నేరాలు కొనసాగాయి.1978 జులై 29న, తన భార్యను హత్య చేసిన ఖైదీ సల్నీ డార్వడ్ని హతమార్చాడు.అంతేకాకుండా, 7 సంవత్సరాల బాలికపై అత్యాచార చేసిన బిల్ రాబర్ట్స్‌ను కూడా చంపేశాడు.
ఈ హత్యల కారణంగా, అధికారులు మాడ్స్లీని ఇతర ఖైదీలతో కలిపి ఉంచడం చాలా ప్రమాదకరమని భావించారు.ఫలితంగా, 1983లో అతని కోసం ప్రత్యేక అద్దాల గదిని నిర్మించారు.
అప్పటి నుండి, అతను అదే గదిలో ఉన్నాడు.తన జైల్ జీవితాన్ని మాడ్స్లీ ఒకసారి నరకంలో బంధించడం లాగా ఉందని వర్ణించాడు.
ప్రస్తుతం అతని వయసు 71 సంవత్సరాలు.ఇప్పటికీ అదే జైలులో ఉండడం వల్ల, అతన్ని నేరస్థుడిగా చూడాలా లేక నిరపరాధుల రక్షకుడిగా భావించాలా అనే సందేహం ప్రజలకు కలుగుతుంది.