టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి శ్రీలీల( Sreeleela ) ఒకరు.పెళ్లి సందడి సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె అనంతరం ధమాకా మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇలా తెలుగులో వరుస సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా ఉన్నా ఈమె ప్రస్తుతం పలు సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.ఇకపోతే తాజాగా శ్రీ లీల తన కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని( Tirumala Srivaru ) దర్శించుకున్నారు.
ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే ఈమె స్వామి వారి దర్శనం చేసుకుని వస్తున్న తరువాత ప్రముఖ సంగీత దర్శకుడు తమన్( Thaman ) సైతం స్వామివారి ఆలయానికి వెళ్లారు.
ఇలా స్వామి వారి ఆలయంలో వీరిద్దరూ ఎదురుపడటంతో ఒకరినొకరు పరామర్శించుకున్నారు.శ్రీ లీల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న తమన్ ఆమెతో మాట్లాడుతూ ఉన్న సమయంలో తన బుగ్గగిల్లారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు ఈయన వ్యవహార శైలిపై విమర్శలు చేస్తున్నారు.
ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమల ఆలయంలోకి వెళ్లి తమన్ ఇలా చేయటం సరైనది కాదు అంటూ ఆయన పై విమర్శలు చేస్తున్నారు.ఇలా స్వామివారి ఆలయంలో ఉన్నారనే విషయాన్ని కూడా మర్చిపోయి ఆమె బుగ్గ గిల్లడం ఏంటి అంటూ విమర్శలు కురిపిస్తున్నారు.అయితే మరికొందరికి ఈ వీడియో స్పందిస్తూ అక్కడ ఏమి జరగలేదని దీనిని పెద్ద రాద్ధాంతం చేయొద్దంటూ కూడా వారికి మద్దతు తెలుపుతున్నారు.
తమన్ కి శ్రీవారి ఆలయం సాంప్రదాయాలు తెలుసని, అతను దర్శనానికి వచ్చిన విధానమే ఇందుకు ప్రత్యక్షనిదర్శనమంటున్నారు.