నల్లగొండ జిల్లా:తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం,ఎన్నికల వేళ ఇచ్చిన హామీలన్నింటిని ఒక్కోక్కటిగా అమలు చేసుకుంటూ వెళ్తుంది.అధికారంలోకి రాగానే ముందుగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం అమలు చేసింది.
ఆ తర్వాత ఆరోగ్యశ్రీ మొత్తాన్ని 10 లక్షల రూపాయలకు పెంచింది.ఆ తర్వాత మహాలక్ష్మి పథకంలో భాగంగా పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత కరెంట్‌తో పాటు.రూ.500లకే గ్యాస్ సిలిండర్ హామీలను ప్రారంభించారు.ఈ ఏడాది అనగా 2024,మార్చి 1వ తేదీ నుంచి ప్రజలకు ఈ రెండు హామీలు అందుబాటులోకి వచ్చాయి.ఇక మహాలక్ష్మి పథకంలో మరో స్కీం పెండింగ్‌లో ఉంది.
అదే 18 ఏళ్లు నిండిన మహిళలందరికి నెలకు 2500 రూపాయలు ఇచ్చే స్కీం.త్వరలోనే దీన్ని అమలు చేయబోతున్నట్లుగా కాంగ్రెస్ సర్కార్ ప్రకటించింది.
అలాగే తెల్ల రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.పెండింగ్ హామీల అమలకు రెడీ అయ్యింది.
ఇన్నాళ్లు ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో పలు హామీల అమలు ఆగిపోయింది.ఇప్పుడు అది పూర్తవ్వడంతో హామీల అమలు దిశగా అడుగులేస్తోంది.
పలు హమీల అమలుకు సంబంధించిన విధివిధానాలు సిద్ధం చేస్తోంది.ఈ క్రమంలో మరో రెండు నెలల్లోగా అనగా జూలై,ఆగస్టు నాటికి మహిళలకు నెలకు 2500 రూపాయలతో పాటుగా తెల్ల రేషన్ కార్డుల మంజూరు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
రానున్న రెండు నెలల్లోగా ఈ స్కీమ్ అమలు చేయాలని సర్కార్ భావిస్తోందట.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోయే అనేక పథకాలకు తెల్ల రేషన్ కార్డు కీలకం కానుంది.
అందుకే వాటి మంజూరుకు రెడీ అవుతున్నారు.అధికారులు ఇంటింటి సర్వే చేసి తెల్లరేషన్ కార్డు కలిగి ఉన్న మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు అందేలా చర్యలు తీసుకోబోతున్నారట.18 ఏళ్ళు నిండిన ప్రతి పేద మహిళకు ఈ స్కీం వర్తించేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నారట.మహాలక్ష్మి పథకానికి తెల్ల రేషన్ కార్డుతో లింక్ ఉండటంతో ముందుగా కొత్త రేషన్ కార్డులు జారీ చేసి ఆ తర్వాత ఈ స్కీం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోన్నట్లు తెలుస్తోంది.
ఇక రానున్న రెండు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి కానుందని తెలుస్తోంది.నిజానికి తెల్ల రేషన్ కార్డుల కోసం తెలంగాణ ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.రెండు నెలల్లో వీటిని అమలు చేస్తే జనాలకు ఎంతో ఊరట కలగనుంది.అలానే మహాలక్ష్మి స్కీమ్ అందరికీ వర్తించకపోవచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
తెల్ల రేషన్ కార్డు ఉన్నా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఫింఛను పొందని మహిళలకు మాత్రమే ఈ సాయం అందుతుందని అంటున్నారు
.