నల్లగొండ జిల్లా:తెలంగాణలో నేటి నుండి రానున్న నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఐఎండీ అధికారులు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది.
ఉత్తర తెలంగాణతో పాటు పలు జిల్లాల్లోకి వర్షాలు పడతాయని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.బుధవారం ఉదయం నల్గొండ, సూర్యాపేట,మహబూబాబాద్, వరంగల్,హన్మకొండ,ఆసిఫాబాద్,మంచిర్యాల,నిర్మల్, నిజామాబాద్,జగిత్యాల, పెద్దపల్లి,జయశంకర్,ములుగు, కొత్తగూడెం,ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఉరుములు, మెరుపులు,ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
బుధవారం నుంచి గురువారం వరకు ములుగు,కొత్తగూడెం, ఖమ్మం,జనగాం,సిద్దిపేట, భువనగిరి,సంగారెడ్డి, మెదక్,కామారెడ్డి,నల్గొండ, సూర్యాపేట,మహబూబాబాద్, నిజామాబాద్,రాజన్నసిరిసిల్ల,కరీంనగర్,పెద్దపల్లి,భూపాలపల్లి,వరంగల్,హన్మకొండ, జిల్లాలో వర్షాలు పడుతాయని ఐఎండీ వివరించింది.ఇక గురువారం నుంచి శుక్రవారం వరకు ఆసిఫాబాద్,మంచిర్యాల,భూపాలపల్లి,మేడ్చల్ మల్కాజ్‌గిరి,మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు వివరించారు.