అల్లు రామలింగయ్య( Allu Ramalingaiah ).పాలకొల్లులో జన్మించిన అల్లు రామలింగయ్య వ్యవసాయ కుటుంబంలో పుట్టారు.
అయితే చదువు ఏమాత్రం అవ్వలేదు దాంతో తండ్రి వ్యవసాయం చేయమంటే కూడా చేసేవారు కాదు.వారిని వీరిని నవ్విస్తూ ఎప్పుడు ఆకతాయిగా, అల్లర చిల్లరగా తిరిగేవారు.
అప్పట్లో నటీనటులందరికి నాటక రంగమే పెద్ద యాక్టింగ్ ఇన్స్టిట్యూట్.అక్కడి నుంచి వచ్చిన వారే సినిమా రంగంలోకి కూడా ఎంట్రీ ఇచ్చేవారు.
అల్లు రామలింగయ్య సైతం నాటకాల్లో వేషాలు వేయాలని ఆశ పడ్డారు.ఎక్కడ నాటకం జరిగినా అక్కడికి వెళ్లిపోయేవారు.
ఓ రోజు నాటకం జరుగుతున్న స్థలానికి వెళ్లిన అల్లు రామలింగయ్య అక్కడ కాంట్రాక్టర్ తో మూడు రూపాయలు ఎదురు ఇచ్చి ఆ నాటకంలో వేషం సంపాదించుకున్నారు.

ఎలాంటి నాటక అనుభవం లేకపోయిన ఆ బృహస్పతి వేషం వేసిన ఆయన చక్కగా నటించారు.ఆ తర్వాత ఆ మూడు రూపాయల కోసం ఇంట్లో బియ్యం దొంగతనం చేసి అమ్మి మరి ఆ అప్పు తీర్చారు.అలా ఎన్నో వేషాలు వేసిన అల్లు రామలింగయ్య చివరికి 1952లో పుట్టిల్లు అనే సినిమాతో హాస్య పాత్రలు వేయడం మొదలుపెట్టారు.
ఆ తర్వాత ఏకంగా వంద చిత్రాల్లో 100 డిఫరెంట్ హాస్య పాత్రలు పోషించిన ఘనత ఆయనకు మాత్రమే దక్కింది.అలా 1952లో మొదలైన ఆయన సినిమా ప్రయాణం 2002లో నవదీప్ హీరోగా వచ్చిన జై సినిమా వరకు కొనసాగింది.
ఇలా ఆయన చివర శ్వాస వరకు నటించారు.ఎన్టీఆర్, అక్కినేని( NTR ) వంటి హీరోలతో మొదలైన అల్లు రామలింగయ్య ప్రస్థానం ఈ తరం కుర్ర హీరోల వరకు కొనసాగడం విశేషం.

అల్లు రామలింగయ్య చిత్ర పరిశ్రమ కోసం చేసిన కృషి కారణంగా 1990లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ( Padma Shri ) ఇచ్చి ఘనంగా సత్కరించింది.ఇక 2001లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డుతో ఘనంగా సన్మానించడం విశేషం.టాలీవుడ్ చిత్ర పరిశ్రమ బందేలు పూర్తి చేసుకున్న సందర్భంగా 2013 వ సంవత్సరంలో సినిమా పరిశ్రమ విడుదల చేసిన 50 తపాలా బిళ్ళల్లో అల్లు రామలింగయ్య జ్ఞాపకార్థం ఒక బిళ్ళ ను విడుదల చేసింది.అల్లు అర్జున్ హీరోగా ప్రస్తుతం ఆయన మనవడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఎంతో పెద్ద హీరో అయ్యాడు.
అయితే అల్లు రామలింగయ్య పేరుపై ఒక స్టూడియో కట్టాలని అల్లు అర్జున్ ( Allu Arjun )భావిస్తున్నాడు.