ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) రాజకీయాల పరంగా చాలా బిజీగా ఉన్నాడు.ఇక ఇప్పుడు తను ‘ఉప ముఖ్యమంత్రి’గా పలు శాఖలకు ‘మంత్రి’ గా కూడా తన బాధ్యతలను కొనసాగిస్తున్నాడు.
ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి మాత అమ్మవారి మాల ధరించినట్టుగా తెలుస్తుంది.అయితే ఆయన ఎందుకు ఆ మాల వేసుకున్నాడు.
అసలు ఆయన మాల వేసుకోవడానికి గల కారణం ఏంటి? అలాగే ఆయన క్యాంపెనింగ్ కోసం వాడుకున్న వాహనానికి ‘వారాహి( Varahi ) ‘ అనే పేరు పెట్టడానికి గల కారణం ఏంటి అనే ఎన్నో డౌట్లు మనందరిలో కలుగుతుంటాయి.నిజానికి పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారిని నమ్మడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి.

అయితే వాటిని ఎప్పుడూ ఎవరు కూడా ఎక్కడ చెప్పలేదు.నిజానికి వారాహి అమ్మవారిని పవిత్రమైన మనస్సుతో ఏ కల్మషం లేకుండా ఒక మంచి పని చేయాలనే ఉద్దేశ్యం తో ఆరాధిస్తే ఆమె మనం మన లైఫ్ లో సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగడానికి తన వంతు భరోసాని ఇస్తుందనే నమ్మకం అయితే జనాల్లో ఉంది.నిజానికి వారాహి అమ్మవారిని ఎక్కువగా ఎవరు కొలవరు.ఇక పవన్ కళ్యాణ్ పుణ్యమాని వారాహి అమ్మవారి గొప్పతనం కూడా జనాలకు తెలుస్తుంది.పవన్ కళ్యాణ్ వేసుకున్న అమ్మవారి మాల గొప్పతనం తెలియాలంటే సుబ్రమణ్య పురం మూవీ ఫేం అయిన ‘సంతోష్ జగర్లపూడి’ డైరెక్షన్ లో సుమంత్ హీరోగా ‘మహేంద్ర గిరి వారాహి( Mahendragiri Varahi ) అనే ఒక సినిమా తెరకెక్కుతుంది.ఇక ఈ సినిమాను కనుక చూసినట్లయితే ఇందులో అమ్మవారి యొక్క ప్రాముఖ్యతను, అమ్మవారి యొక్క గొప్పతనాన్ని ఆమె ఔన్నత్యాన్ని జనాలకి ఆమె ఏం చేసింది ఆమెను ఎందుకు దేవతగా కొలుస్తున్నారనే కొన్ని ప్రశ్నలకి సమాధానం దొరకబోతున్నట్టుగా ఈ సినిమా టీజర్ ను చూస్తే మనకు క్లియర్ గా అర్థం అవుతుంది.

నిజానికి పవన్ కళ్యాణ్ వారాహి అనే వాహనాన్ని కొనుగోలు చేసే కంటే ముందే ఈ సినిమాను టైటిల్ ని ఫిక్స్ చేసి షూటింగ్ అయితే ప్రారంభించారు.కానీ మధ్యలో టెంపుల్ కి సంభందించిన లోకేషన్స్ ప్రాబ్లం రావడం వల్ల ఈ సినిమాను తెరకెక్కించడంలో షూట్ కొద్ది రోజులు పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది.లేకపోతే ఈపాటికే సినిమా రిలీజ్ అయి వారాహి అమ్మవారి గొప్పతనాన్ని అందరికీ తెలిసేలా చేసేది.ఇక ఇప్పటికైనా లేటుగా వచ్చిన లేటెస్ట్ గా వస్తుంది అనేలా ఈ సినిమా చూస్తే ప్రేక్షకులకు అమ్మవారి మీద సరైన క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.
మన తెలుగులో సుబ్రమణ్యస్వామి, వినాయకుడు, శివుడు లాంటి దేవుళ్ళ గొప్పతనాన్ని తెలిపే సినిమాలే వచ్చాయి.కానీ ఫస్ట్ టైం దేవత యొక్క గొప్పతనాన్ని తెలిపే సినిమాగా ‘మహేంద్ర గిరి వారాహి‘ సినిమా రాబోతుంది.
ఇక ఈ సినిమా చూస్తే మాత్రం డెఫినెట్ మనకు దేవుళ్ళ పట్ల గాని, అమ్మవారి పట్ల గాని ఒక సరైన క్లారిటీ అయితే వచ్చే అవకాశాలున్నాయి.ఇక పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారిని అంత బలంగా నమ్మడానికి గల కారణం ఏంటో తెలియాలన్న కూడా తొందర్లో రిలీజ్ కాబోతున్న ఈ ‘మహేంద్ర గిరి వారాహి’ సినిమాను చూడాల్సిందే…








