మనలో చాలామంది చిన్నప్పటి నుంచి స్నేహితులతో కానీ.బంధువులతో గాని.
చిన్నచిన్న పందాలు వేసి ఉంటాం.అది డబ్బులతో కూడిన వెనకాని లేకపోతే మరో ఏదో ఒకరమైన వస్తువు కానీ సంబంధించి పందాలు జరిగా ఉంటాయి.
సినిమాల్లో చూపించిన విధంగా కొందరు బైక్ రేసింగ్ కార్ రేసింగ్ అంటూ పందెలు కాయడం కూడా మనం చూసే ఉంటాము.ఇలాంటి సందర్భాల్లో కొన్ని పొరపాట్ల వల్ల చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు.
వీటికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఇలాంటి సంఘటన ఒకటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో (state of Uttar Pradesh)చోటు చేసుకుంది.
ఈ ఘటనకు సంబంధించిన విశేషాలు చూస్తే.
రాష్ట్రంలోని లక్నోలో ఉన్న ఇటౌంజాలో ఇద్దరు వ్యక్తులు మధ్య పందెం జరగగా అందులో ఓ వ్యక్తి మరణించాడు.గత రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ప్రస్తుతం ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది.<ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో(Lucknow) నగరంలో జరిగిన ఘటనలో చెందిన ఇద్దరు యువకులు ట్రాక్టర్ స్టంట్ పై 15 వేల రూపాయల పందెం వేశారు.ఇందులో భాగంగా 22 ఏళ్ల నీరజ మౌర్య జోగిందర్ యాదవ్ వారి ట్రాక్టర్లుకు గొలుసులు వెనుకవైపు కట్టారు.
ఆ తరవాత ట్రాక్టర్లును ముందుకు లాగేందుకు పోటీపడ్డారు.
పోటీ ప్రారంభమైన కొన్ని సెకన్ల సమయంలోనే నీరజ్ నడిపిన ట్రాక్టర్ ఒక్కసారిగా నిటారుగా పైకి లేచింది.అంతేకాదు., అలా ట్రాక్టర్ పైకి లేయడంతో పూర్తిగా కింద బోల్తా పడింది.దీంతో ఆ వ్యక్తి ఆ ట్రాక్టర్ కింద నలిగిపోయాడు.పందాన్ని చూడడానికి వచ్చిన చాలామంది జనం ఘటన జరిగిన వెంటనే ట్రాక్టర్ ను ఎత్తడానికి అక్కడికి చేరారు.నీరజ్ ను కాపాడేందుకు అక్కడివారు ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది.
వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.ఈ సంఘటనకు సంబంధించి వీడియో వైరల్ కావడంతో ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
ఈ ఘటనలో మరో ట్రాక్టర్ డ్రైవర్ జోగిందర్ యాదవ్ ను పోలీసులు అరెస్టు చేశారు.