అమెరికా ఉపాధ్యక్షుడిగా వివేక్ రామస్వామి.. డొనాల్డ్ ట్రంప్ షార్ట్ లిస్ట్‌లో చేర్చారా, ఆన్‌లైన్‌లో చర్చ

మరికొద్దినెలల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.డెమొక్రాటిక్ పార్టీ నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, ( Joe Biden ) రిపబ్లికన్ పార్టీ తరపున మాజీ అధ్యక్షుడు డొనాల్ ట్రంప్‌లు మరోసారి తలపడుతున్నారు.

 Us Presidential Elections 2024 Speculation And Rumors Surround Donald Trump's V-TeluguStop.com

వీరిద్దరూ ఫండ్ రైజింగ్, ప్రచార కార్యక్రమాలను హోరెత్తిస్తున్నారు.ఎన్నికల సర్వేలు, ఓపీనియన్ పోల్స్‌ మాత్రం బైడెన్‌తో పోలిస్తే ట్రంప్ ముందంజలో ఉన్నారని చెబుతున్నాయి.

మరి ట్రంప్‌కు వైస్ ప్రెసిడెంట్ ఎవరు అనే ప్రశ్నలు ఎప్పటి నుంచో వినిపించడంతో పాటు పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి.అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నామినేషన్ కోసం ప్రయత్నించిన భారత సంతతికి చెందిన బిలియనీర్ వివేక్ రామస్వామి పేరు మరోసారి వినిపిస్తోంది.

అయితే.అంతకుముందు మార్చిలో వివేక్ తన వైస్ ప్రెసిడెంట్‌గా ఉంటారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ట్రంప్ తోసిపుచ్చారు.కానీ గతవారం విస్కాన్సిన్‌లో జరిగిన ర్యాలీలో వివేక్ రామస్వామి పేరును ట్రంప్ ( Trump )మరోసారి ప్రస్తావించడంతో అమెరికన్ రాజకీయాలలో కలకలం రేగింది.రామస్వామిని ట్రంప్ తెలివైన వ్యక్తిగా అభివర్ణించారు.

అయితే ఉపాధ్యక్షుడే కాకుండా.ఏదో ఒక రూపంలో వివేక్ మాతోనే ఉంటాడని డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Telugu Donald Trump, Joe Biden, York, Trump, Presidential, Vivek Ramaswamy, Vp-T

అటు వివేక్ కూడా ట్రంప్ మనకాలపు జార్జ్ వాషింగ్టన్ అంటూ ప్రశంసించారు.ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్‌కు వివేక్ రామస్వామి( Vivek Ramaswamy ) ఉపాధ్యక్షుడిగా ఉంటారంటూ సోషల్ మీడియా హోరెత్తిపోతోంది.రామస్వామి ప్రతినిధి గతవారం న్యూయార్క్ పోస్ట్‌తో మాట్లాడుతూ.మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయని.వివేక్ ప్రధాన దృష్టి ట్రంప్‌ను ఎన్నుకునేలా చేయడంపైనే ఉందన్నారు.కాగా.

అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన రామస్వామి.జనవరిలో అయోవా కాకస్‌లలో నాల్గవ స్థానంలో నిలిచి రేసు నుంచి తప్పుకున్నారు.

రిపబ్లికన్ పార్టీ నామినేషన్‌ను పొందడంలో విఫలమైనప్పటికీ ట్రంప్ మద్ధతును, ప్రచార ర్యాలీలలో ప్రజల నుంచి మంచి ఆదరణను దక్కించుకున్నారు.ట్రంప్ అధ్యక్షుడైతే ఉపాధ్యక్షుడు రామస్వామేనని అమెరికాలో చర్చ జరుగుతోంది.

Telugu Donald Trump, Joe Biden, York, Trump, Presidential, Vivek Ramaswamy, Vp-T

మహిళా అభ్యర్ధిని ఎంపిక చేస్తే ప్రయోజనం వుంటుందని భావించడం వల్లే రామస్వామిపై కొందరు విముఖత చూపారని కథనాలు వస్తున్నాయి.కానీ మహిళా ఉపాధ్యక్ష అభ్యర్ధి వుండటం వల్ల ఎలాంటి ప్రభావం వుండదని చరిత్ర చెబుతోంది.న్యూయార్క్ రిపబ్లికన్ ఎలిస్ స్టెఫానిక్, అర్కాన్సాస్ గవర్నర్ సారా హకబీ శాండర్స్, డెమోక్రటిక్ పార్టీ మాజీ ప్రతినిధి తులసీ గబ్బార్డ్, ఫైర్‌బ్రాండ్ రిపబ్లికన్ కారీ లేక్ , సౌత్ డకోటా గవర్నర్ క్రిస్టి నోయెమ్‌లను ట్రంప్ తన రన్నింగ్ మేట్ కోసం పరిగణించవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube