వైరల్.. ఇదేందయ్యా ఇది.. లడ్డూ బాక్స్ లో పెట్టి పంపితే హల్వా ఎలా అయ్యిందబ్బా..?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే.అయితే కొన్ని ప్రణతాలలో మాత్రం ఇంకా ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలను దాటుతున్నాయి కూడా.

 Viral.. This Is It How Did The Halwa Turn Out If Put It In A Brownie Box And Se-TeluguStop.com

అంతెందుకు ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే 50 డిగ్రీల దాదాపు దగ్గరగా చేరుకుంది.ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ( Delhi ) నగరంలో అయితే ఉష్ణోగ్రతలు అసలు తగ్గుముఖం పట్టట్లేదు.

దేశం మొత్తం వానలు కురుస్తున్న ఢిల్లీలో మాత్రం ఎండలు ముప్పుతిప్పలు పెడుతున్నాయి.ఇక ఢిల్లీ నగరంలో ఎండల పరిస్థితి ఎలా ఉందో విషయం సంబంధించి తెలిపే ఓ పోస్ట్ తాజాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఈ పోస్టు చూసినవారు నిజంగా అవాక్కవుతున్నారు.ఎండా తీవ్రతలకు ఇలా కూడా జరుగుతుందా అంటూ ఆశ్చర్యపోతున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.

ఢిల్లీ నగరంలోని హోమియోపతి డాక్టర్ గా పనిచేస్తున్న భూమిక తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఓ పోస్ట్ చేసింది.ఆ పోస్టులో ఏముందంటే.తన తల్లి ఎంతో ప్రేమగా లడ్డూలు( LADDUS ) చేసి వాటిని పంపించగా దానిని నేను అందుకుని బాక్స్ ఓపెన్ చేసి చూడగా ఒక్కసారిగా షాక్ గురయ్యానంటూ తెలిపింది.

దీనికి కారణం ఢిల్లీ వేడి అంటూ చెబుతూనే నగరంలోని వేడికి ఆ లడ్డులన్నీ కాస్త కరిగిపోయి హల్వాగా మారిందంటూ పోస్టులో రాసుకోవచ్చింది.ఈ ఘటనకు సంబంధించిన ఫోటో తీసి భూమిక ట్విట్టర్ ద్వారా పంచుకుంది.

ఈ ఫోటోకు “డియర్ బేసిన్ లడ్డు.వెల్కమ్ టు ఢిల్లీ హీట్” అంటూ కాస్త చమత్కారంగా రాసుకు వచ్చింది.

ప్రస్తుతం ఈ ట్వీట్ కాస్త సోషల్ మీడియా( Social media )లో తెగ వైరల్ గా మారింది.

ఇక ఈ ఫోటోను చూసిన నెటిజెన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.ఈ ఫోటో చూసిన వారిలో కొందరు “అమ్మ.మీ లడ్డూలు బాగా వైరల్ అవుతున్నాయి.

ఒకసారి చూడండి., అంటూ కామెంట్ చేస్తుండగా మరికొందరైతే “ఇది బేసిన్ హల్వా” అంటూ కాస్త చమత్కారంగా కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube