తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Telangana Chief Minister Revanth Reddy ) శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ క్రమంలో రైతు భరోసా గురించి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి అమలు చేస్తామని స్పష్టం చేశారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం.మే 6, 2022న వరంగల్ రైతు డిక్లరేషన్ లో రెండు లక్షల రూపాయలు రైతు రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ( Rahul Gandhi ) మాట ఇచ్చారు.రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం.గత ప్రభుత్వం పదేళ్లలో రుణమాఫీ కింద రెండు విడతలుగా 16 వేల కోట్లు, 12 వేల కోట్లు రైతుల ఖాతాలో వేసింది.
కానీ మేము ఒకేసారి 48 లక్షల మంది రైతులకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు.“డిసెంబర్ 12వ తారీకు 2018 నుంచి డిసెంబర్ 9, 2023 వరకు రైతులు తీసుకున్నారు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తున్నట్లు తెలిపారు.ఇందుకోసం 31 వేల కోట్లు అవసరం.వీటిని సేకరించి అన్నదాతలకు రుణ విముక్తి కల్పిస్తాం.వ్యవసాయం దండగ కాదు పండగ అని భరోసా కల్పిస్తాం.జులై 15 కల్లా నివేదిక వస్తుంది.
బడ్జెట్ సమావేశాల్లో ఆ నివేదికను ప్రవేశపెట్టి రైతు భరోసా విధివిధానాలు నిర్ణయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది.