సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి నటుడు చిరంజీవి ( Chiranjeevi ) మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ ( Shirish Bhardwaj ) మరణించారు.గత కొంతకాలంగా ఈయన లంగ్స్ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు.
అయితే కొద్ది రోజుల నుంచి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఉన్నటువంటి ఈయన పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారని సినీవర్గాలు తెలియజేస్తున్నాయి.శిరీష్ భరద్వాజ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజను( Sreeja ) ప్రేమించి ఇంట్లో వారికి తెలియకుండా పెళ్లి చేసుకున్నారు.
శ్రీజ శిరీష్ వివాహం 2007వ సంవత్సరంలో జరిగింది.ఇక ఈ వివాహం తర్వాత మెగా ఫ్యామిలీ నుంచి తనకు ప్రాణహాని ఉంది అంటూ అప్పట్లో శ్రీజ చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారాయి.
ఇలా ఇంట్లో వారికి తెలియకుండా పెళ్లి చేసుకున్న ఈమె ఒక బిడ్డకు జన్మనిచ్చారు.ఇలా పాప పుట్టిన తర్వాత కొంతకాలానికి ఇద్దరు మధ్య మనస్పర్ధలు వచ్చాయి.దీంతో 2014వ సంవత్సరంలో శిరీష్ తో విడాకులు తీసుకొని విడిపోయిన శ్రీజ తన బిడ్డతో సహా తన తండ్రి వద్దకు వచ్చారు.ఇలా మొదటి భర్త శిరీష్ కి విడాకులు ఇచ్చిన ఈమె అనంతరం కళ్యాణ్ దేవ్ ( Kalyan Dev ) అనే వ్యక్తిని కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.
ఇక ఈ దంపతులకు కూడా మరొక కుమార్తె జన్మించింది.అయితే ఇద్దరి మధ్య విభేదాలు కారణంగా వీరు కూడా విడాకులు తీసుకొని విడిపోయారని అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదని తెలుస్తుంది.ఇలా ఇద్దరి భర్తలకు విడాకులు ఇచ్చిన ఈమె ప్రస్తుతం తన ఇద్దరి కూతుర్లతో కలిసి ఒంటరిగా ఉంటున్నారు.ఇక శ్రీజకు విడాకులు ఇచ్చిన అనంతరం శిరీష్ భరద్వాజ్ 2019 సంవత్సరంలో మరొక వివాహం చేసుకున్నారు.
అయితే ఈయన ఇలా అనారోగ్య సమస్యలతో మరణించారనే వార్త తెలియడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.