సాధారణంగా ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు ఫోటోగ్రాఫర్లను సంప్రదిస్తాము.ఒక ఫోటోగ్రాఫర్ బిజీగా ఉంటే వేరే ఫోటోగ్రాఫర్‌ను హైర్ చేసుకుంటాం.
కానీ అంబానీ, అదానీ ఇలాంటి ప్రముఖులు మాత్రం ఒక్క ఫోటోగ్రాఫర్ కోసమే వెయిట్ చేస్తారు.ఆ ఫోటోగ్రాఫర్ సింగిల్ డేకే రూ.1.25 లక్షల నుంచి 1.50 లక్షల వరకు ఛార్జ్ చేస్తాడు.అయినా అతనే కావాలని కోరుకుంటారు.
అయితే ఆ ఫోటోగ్రాఫర్ తెలుగోడు, పక్కా హైదరాబాదీ కావడం విశేషం.అసలు ఎవరి ఫోటోగ్రాఫర్ ఆయనకు ఎందుకు ఇంత డిమాండ్? అనేది తెలుసుకుందాం.ప్రస్తుతం సోషల్ మీడియాలో సెలబ్రిటీలుగా మారిన ఎంతోమంది టాలెంటెడ్ పర్సన్స్ అందమైన ఫోటోలు తీస్తూ పాపులర్ అయ్యాడు ఆ ఫోటోగ్రాఫర్.అతని పేరు జోసెఫ్ రాధిక్( Joseph Radhik ).ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ తన పెళ్లి ఫోటోలన్నీ జోసెఫేతోనే తీయించుకుంటున్నాడు.
అనంత్ అంబానీ- రాధికా మర్చంట్( Anant Ambani- Radhika Merchant ) ఫస్ట్, సెకండ్ ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరిగిన సంగతి తెలిసిందే.ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలను జోసెఫ్ రాధిక్ అద్భుతంగా క్యాప్చర్ చేశాడు.కత్రినా కైఫ్- విక్కీ కౌశల్, విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ, సిద్ధార్థ్ మల్హోత్రా-కియారా అద్వానీ, కేఎల్ రాహూల్-అతియాశెట్టి, నాగచైతన్య-సమంతా రుతుప్రభు, ప్రియాంకా చోప్రా-నిక్ జోనాస్, వరుణ్ ధావన్- నటాషా దళాల్ వంటి సెలబ్రిటీల పెళ్లిళ్ల ఫోటోలు కూడా తీసింది జోసెఫ్ రాధిక్యే!!యూరప్‌లో జరిగిన అనంత్, రాధికా ప్రీవెడ్డింగ్ వేడుక క్షణాలను కూడా అద్భుతంగా క్యాప్చర్ చేశాడు జోసెఫ్ రాధిక్.
ఆ ఫొటోలు చాలా వైరల్ అయ్యాయి వాటిని సామాన్యులే కాకుండా సెలబ్రిటీలు కూడా చూసేస్తున్నారు.లగ్జరీ క్రూయిజ్ షిప్లో అనంత్, రాధికా జంట మధ్య కనిపించిన ప్రతీ రొమాంటిక్ ఎమోషన్‌ను అద్భుతంగా పిక్స్ తీశాడు జోసెఫ్.
ఆ పిక్స్ చూసి చాలామంది ఫిదా అవుతున్నారు అందుకే ఇప్పుడు అతని పేరు భారతదేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోతోంది.
జోసెఫ్ రాధిక్ హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ (2001-2005) కంప్లీట్ చేశాడు.ఆపై ఇండోర్‌లోని ఐఐఎంలో పీజీ చేశాడు.అతని పేజీ ఒక బిజినెస్ కోర్స్ కి సంబంధించినది.
దీని తర్వాత 3 ఏళ్లు కార్పోరేట్ ఉద్యోగాలు చేశాడు.ఆ సమయంలో టూత్ పేస్టులు విక్రయించడానికి ఊళ్లు పట్టుకొని తిరిగాడు.
అయితే ఆ చదువులు, ఉద్యోగాలు అతనికి తృప్తినివ్వలేదు.చివరికి జోసెఫ్ 2010లో జాబుకు రిజైన్ చేశాడు.
అప్పటికే ఫోటోగ్రఫీ అంటే అతనికి చాలా ఇష్టం ఏర్పడింది.ఆ ఇష్టంతోనే ఫుల్ టైమ్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ గా క్రియేటివ్ కెరీర్ స్టార్ట్ చేశాడు.
మంచి అభిరుచి ఉండటం వల్ల ఈ రంగంలో టాప్ ఫోటోగ్రాఫర్ అయిపోయాడు.అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల తర్వాత మరింత పాపులర్ అయ్యాడు.
ఇప్పుడు అతనికి గిరాకీ చాలా పెరిగి ఉండొచ్చని తెలుస్తోంది.జులై 12న ముంబైలో జరుగబోయే అనంత్-రాధిక పెళ్లికి కూడా ఈ 41 ఏళ్ల జోసెఫ్ ఫోటోగ్రాఫర్ గా సెలెక్ట్ అయ్యాడు.
ఈ వేడుకలో ఆయన తీయనున్న ఫోటోలు ఇతడిని మరో రేంజ్ కు తీసుకెళ్తాయి.ఏదేమైనా భారతదేశంలోని మిగతా ఫోటోగ్రాఫర్ల అందరినీ వెనక్కి నెట్టి ఉత్తర భారత దేశాన్ని ఏలేస్తున్నాడు ఈ హైదరాబాదీ వ్యక్తి.