కురుల బలహీనతను పోగొట్టే న్యాచురల్ హెయిర్ మాస్క్.. వారానికి ఒక్కసారి ప్రయత్నిస్తే మరిన్ని బెనిఫిట్స్!!

పోషకాల కొరత, ఒత్తిడి, కాలుష్యం, వేడి వేడి నీటితో తల స్నానం చేయడం, రసాయనాలతో కూడిన షాంపూలను వినియోగించడం, హెయిర్ స్టైలింగ్ టూల్స్ ను వాడటం తదితర కారణాల వల్ల ఒక్కోసారి జుట్టు బలహీనంగా మారుతుంటుంది.ఫలితంగా హెయిర్ ఫాల్,( Hair Fall ) హెయిర్ బ్రేకేజ్ వంటివి అధికంగా ఇబ్బంది పెడుతుంటాయి.

 Try This Natural Mask For Hair Strengthening Details, Hair Strengthening, Hair-TeluguStop.com

వీటికి చెక్ పెట్టి కురుల బలహీనతను పోగొట్టడానికి న్యాచురల్ హెయిర్ మాస్క్ ఒకటి ఉంది.ఈ హెయిర్ మాస్క్ ను వారానికి ఒకసారి ప్రయత్నిస్తే అదిరిపోయే బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.

అందుకోసం ముందుగా ఒక కలబంద ఆకు( Aloevera Leaf ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న కలబంద ముక్కలు వేసుకోవాలి.

అలాగే ఒక కప్పు బియ్యం వండిన తర్వాత వచ్చే గంజిని( Rice Water ) పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను స‌పరేట్ చేసుకోవాలి.

Telugu Breakage, Care, Care Tips, Fall, Healthy, Latest, Natural-Telugu Health

ఇప్పుడు ఈ జ్యూస్ లో రెండు టేబుల్ స్పూన్లు ఆముదం( Castor Oil ) వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ తో జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ సింపుల్ హెయిర్ మాస్క్ వేసుకోవడం వల్ల చాలా లాభాలను పొందుతారు.

Telugu Breakage, Care, Care Tips, Fall, Healthy, Latest, Natural-Telugu Health

ముఖ్యంగా కలబంద, ఆముదం మరియు అన్నం గంజి లో ఉండే పోషకాలు బలహీనంగా మారిన కురులను దృఢంగా మారుస్తాయి.హెయిర్ ఫాల్, హెయిర్ బ్రేకేజ్ సమస్యలకు అడ్డుకట్ట వేస్తాయి.అలాగే పొడి జుట్టును రిపేర్ చేస్తాయి.కురులు స్మూత్ గా సిల్కీగా మెరిసేలా ప్రోత్సహిస్తాయి.అంతేకాదు ఈ హెయిర్ మాస్క్ వేసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా మారుతుంది.ఒత్తుగా సైతం పెరుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube