ఈవీఎంల విషయంలో జగన్ సంచలన ట్వీట్లు.. జగన్ అనుమానాలే నిజమని ప్రూవ్ కానుందా?

మాజీ సీఎం వైఎస్ జగన్( YS Jagan ) ఈవీఎంల విషయంలో అనుమానాలను వ్యక్తం చేస్తూ చేసిన ట్వీట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి.ఏపీలో ఎన్నికల ఫలితాల గురించి చర్చ జరుగుతున్న తరుణంలో న్యాయం జరగడం అంటే న్యాయం చేయడం మాత్రమే కాదని న్యాయం చేసినట్టు కూడా తెలియాలని జగన్ వెల్లడించారు.

 Jagan Sensational Tweets About Evms Details, Ys Jagan Mohan Reddy, Jagan Tweet,-TeluguStop.com

ప్రజాస్వామ్యం బలంగా ఉండాలంటే బలంగా ఉన్నట్టు కనపడాలి కదా అని జగన్ వెల్లడించారు.ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలలో సైతం పేపర్ బ్యాలెట్ల( Ballot Papers ) ద్వారా ఎన్నికలు జరుగుతున్నాయని మన దేశంలో కూడా ప్రజాస్వామ్య స్పూర్తిని నిలబెట్టుకోవాలంటే ఈవీఎంలకు( EVM ) బదులుగా పేపర్ బ్యాలెట్ లను ఉపయోగించాలని జగన్ చెప్పుకొచ్చారు.

మహారాష్ట్ర రాష్ట్రంలో జరిగిన ఒక ఘటన వల్ల ఈవీఎంల విషయంలో అనుమానాలు నెలకొన్నాయి.

ఎలన్ మస్క్( Elon Musk ) సైతం ఈవీఎంల హ్యాక్ చేసే అవకాశాలు ఉన్నాయనే విధంగా సంచలన ట్వీట్లు చేయడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి.ఏపీలోని కొన్ని నియోజకవర్గాల్లో ప్రజలకు ఏ మాత్రం సుపరిచితం లేని అభ్యర్థులు సైతం గెలవడంతో ఈవీఎంల విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.జగన్ అనుమానాలే నిజమని రాబోయే రోజుల్లో ప్రూవ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని సమాచారం అందుతోంది.

ఈవీఎంలను మొబైల్ ఫోన్లలోని వన్ టైమ్ పాస్ వర్డ్ తో అన్ లాక్ చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.ఈవీఎంల విషయంలో నెలకొన్న అనుమానాలకు చెక్ పెట్టేలా కేంద్ర ఎన్నికల సంఘం( Central Election Commission ) నుంచి పూర్తిస్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది.ఈవీఎంల విషయంలో తప్పులు జరిగాయని ప్రూవ్ అయితే ప్రజస్వామ్యం అపహాస్యం అవుతుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.వైసీపీ ఓడిపోవడం కంటే ఆ పార్టీకి మరీ తక్కువ సంఖ్యలో సీట్లు రావడంపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube