గత కొంతకాలంగా టోల్ ప్లాజాల( Toll Plaza ) వద్ద కొన్ని రకాల సంఘటనలు సంబంధించి అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తున్నాయి.కొందరు వాహనాదారులు టోల్ ప్లాజా ఫీజ్( Toll Plaza Fee ) కట్టేందుకు నిరాకరించి టోల్ ప్లాజా వద్ద పనిచేస్తున్న కొందరు కార్మికులపై వాహనాలు గుద్దుతూ వెళ్లిపోవడం లాంటి సంఘటనలు చాలానే జరిగాయి.
ఈ ఘటనలో చాలామంది ప్రాణాపాయ స్థితుల వరకు వెళ్తున్నారు.ఈ ఘటనలకు సంబంధించి ఎప్పటికప్పుడు వీడియోలు సోషల్ మీడియా ద్వారా ప్రజలు చూస్తూనే ఉన్నారు.
ఇకపోతే తాజాగా టోల్ ప్లాజా వద్ద మరో సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వీడియోలో ఓ పోలీస్ అధికారి( Police Officer ) టోల్ ప్లాజా సిబ్బందిపై ప్రవర్తించిన తీరు ఇప్పుడు నైటిజన్ల ఆగ్రహానికి లోనవుతుంది.ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.గ్రేటర్ నోయిడాలోని( Greater Noida ) దాద్రీ లుహర్లీ టోల్ ప్లాజా వద్ద ఖాకీ యూనిఫాంలో పోలీస్ అధికారి గూండాయిజం ప్రదర్శించారు.
వీడియోలో గమనించినట్లయితే సదరు ఇన్స్పెక్టర్ మొదట పోలీసులతో వాదించి, ఆపై బలవంతంగా టోల్ గేట్ ఓపెన్ చేసి., కార్మికులపై దాడికి యత్నించాడు.
ఈ సమయంలో ఇన్స్పెక్టర్ దౌర్జన్యానికి సంబంధించిన వీడియో సీసీటీవీ ఫుటేజీలో రికార్డైంది.
అంతే కాకుండా ఆపై టోల్ బూత్ లో ఉన్న టోల్ కార్మికులపై( Toll Staff ) కూడా ఇన్స్పెక్టర్ దాడి చేసి., బలవంతంగా అడ్డంకిని తెరిచి అనేక వాహనాలను ఒకదాని తర్వాత ఒకటి టోల్ మీదుగా వెళ్లేలా చేశాడు.అందిన సమాచారం మేరకు.
ఇన్స్పెక్టర్ బులంద్‌షహర్ నుండి ఘజియాబాద్ వైపు వెళ్తుండగా.ఆయనతో పాటు ఇతర పోలీసులు కూడా అక్కడ ఉన్నారు.
లుహర్లీ టోల్ ప్లాజా వద్ద ఆగిన అతను., చాలా సేపు టోల్ ప్లాజా వద్ద తన కారు పార్క్ చేయడంతో టోల్ గేట్ వద్ద అక్రమాలు జరిగినట్లు వెలుగులోకి వచ్చింది.