సాయి కృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో వార్షికోత్సవం ,సాయిబాబును దర్శించుకున్న కొండూరి గాంధీ రావు రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sirisilla District) గంభీరావుపేట మండలం గోరింటాల గ్రామంలో శ్రీ షిరిడి సాయిబాబా (Shirdi Saibaba,)మందిరంలో 20వ వార్షికోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి.బొంబోతుల సాయి కృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి.
పురోహితులు కంజర్ల శ్రీనివాస్ చారి, సప్తగిరి చారి, కొండపాక శ్రీనివాస్ చారి లు 20 వ వార్షికోత్సవ సందర్భంగా గణపతి పూజ , పుణ్యా వచనం, రక్షబంధనం , అఖండ దీపారాధన ,అంకురార్పణ , మండపారాధన , అగ్ని ప్రతిష్ట, ఆవాహిక దేవత హోమం , పూర్ణహుతి , మంగళహారతులు, 32 రకాల కళాశాలతో కళీశాభిషేకం , పంచామృత అభిషేకం, ఆశీర్వాదం ఆశీర్వచనం పాల్గొన్న భక్తకోటికి తీర్థ ప్రసాద వితరణ చేశారు.బొంబొతుల సాయి గౌడ్ ప్రసన్న, ఆర్ టీ సి ఉద్యోగి బొంబోతుల నర్సా గౌడ్ విజయ, మాజీ సర్పంచ్ పొలుసుల అంజమ్మ బాల్ రెడ్డి దంపతులచే ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు కొండూరి గాంధీ రావు , స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.ఈ వార్షికోత్సవ వేడుకల్లో ఎంపీటీసీ నాగభూషణం, సింగిల్ విండో డైరెక్టర్ రావుల అంజిరెడ్డి , నాయకులు దండ వేణి శ్రీనివాస్, జక్కాపురం చంద్రయ్య, మూల చంద్ర రెడ్డి ,గరికే తిరుపతి, ఈసాయిపేట ప్రసాద్ , సముద్ర లింగాపూర్ మాజీ సర్పంచ్ భూమా రాజం , కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి బాల్ రెడ్డి, కోడూరి నాగరాజు, పటాకుల నర్సా గౌడ్, దానవీని రమేష్ భాష వేణి సత్యనారాయణ , భాష వేణి పవన్ సాయి శనిగరం ముత్తయ్య తదితరులు పాల్గొని స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న గ్రామస్తులకు అన్నదానం నిర్వహించారు.