ఇండస్ట్రీలో హీరో అంటే ముందుగా ప్రతి ప్రేక్షకుడు కూడా ఆయన అందంగా ఉన్నాడా లేదా అనేది చూస్తాడు.మొదట ఫిజికల్ అప్పీయరెన్స్ మాత్రమే చూస్తారు.
అందుకే క్యూట్ లుక్స్ తో మంచి బాడీ తో ఉండే హీరోని చూడగానే ప్రతి ప్రేక్షకుడు కూడా చాలా ఆనందపడతాడు.అందంగా లేని హీరోను చూసిన ప్రేక్షకుడు ఇతనేం హీరో అంటూ ఎగతాళి చేస్తాడు.
ఇక ఇండస్ట్రీలో చాలామంది హీరోలు అంత అందంగా ఉండకపోయిన కూడా వాళ్ళ నటనతో కానీ, లేదా సినిమా ఇండస్ట్రీ లో ఉన్న బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ తో కానీ సినిమాలు చేస్తూ ఉంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే ఇండస్ట్రీ లో ఉన్న కొంతమంది హీరోల కంటే కూడా మన తెలుగులో ఉన్న స్టార్ డైరెక్టర్లు చాలా అందంగా ఉంటారంటూ చాలా మంది కామెంట్స్ కూడా చేస్తున్నారు…
ముందుగా అతనొక్కడే సినిమాతో డైరెక్టర్ గా మారిన సురేందర్ రెడ్డి( Surendar Reddy ) క్యూట్ లుక్స్ తో చూడగానే హీరో అనిపించేలా చాలా అందంగా ఉంటాడు.
ఆయన అందం ముందు చాలా మంది హీరోలు కూడా పనికిరారు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.కానీ ఆయన డైరెక్టర్ అవడం వల్ల సినిమాల్లో నటించలేకపోయాడు.ప్రస్తుతం ఆయన ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు…

ఇక రన్ రాజా రన్ సినిమాతో ఒక సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్న సుజీత్( Sujeeth ) కూడా హీరో అందానికి ఏ మాత్రం తగ్గకుండా ఉంటాడు.నిజానికి రన్ రాజా రన్ సినిమా తీస్తున్న సమయంలో సుజీత్ శర్వానంద్ వాళ్ల తమ్ముడేమో అని అందరూ అనుకున్నారు.అలా శర్వానంద్ ఎలా అయితే ఉంటాడో అలాంటి అందంతోనే తను కూడా ఉండడం విశేషం…

ఇక సుమంత్ తో ‘సుబ్రమణ్య పురం’ నాగశౌర్యతో ‘లక్ష్య’ లాంటి సినిమాలను తీసి మంచి గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ సంతోష్ జగర్లపూడి…( Director Santosh Jagarlapudi ) ప్రస్తుతం ఆయన సుమంత్ తోనే ‘మహేంద్రగిరి వారాహి’ అనే సినిమా చేస్తున్నాడు.ఇక ఈ సినిమా ద్వారా దేవుడి గొప్పతనాన్ని తెలియజేయబోతున్నాడు.ఇక సురేందర్ రెడ్డి సుజీత్ లానే ఈయన కూడా చాలా బబ్లీ లుక్స్ తో చూడగానే హీరో మెటీరియల్ అనిపించేలా ఉంటాడు…ఇక ఈయన సెట్స్ లో ఆర్టిస్ట్ లకు ఎలా నటించాలో కూడా తను చేసి చూపిస్తాడు.బేసిగ్గా ఆయన చాలా మంచి నటుడని ఆయనతో వర్క్ చేసిన చాలా మంది చెప్తూ ఉంటారు… ఇక ఇలా ఇండస్ట్రీలో ఉన్న కొంత మంది దర్శకులు కొంత మంది హీరోల కంటే కూడా చాలా అందంగా ఉండడం విశేషం…








