ఏపీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) భారీ మెజార్టీతో పిఠాపురంలో గెలిచిన విషయం తెలిసిందే.అంతేకాకుండా జనసేన తరపున నిలబడిన ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు,ఎంపీలు కూడా గెలవడంతో జనసేన పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.
దీంతో పవన్ కళ్యాణ్ కు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు అభిమానులు కుటుంబ సభ్యులు.ఇక మెగా ఇంట్లో సంబరాలు చేసుకుంటున్నారు.
అందులో భాగంగానే తాజాగా పవన్ కళ్యాణ్ ఎన్నికలలో గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా తన అన్నయ్య మెగాస్టార్ ఇంటికి చేరుకున్నారు.

దీంతో పవన్ కళ్యాణ్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు మెగా కుటుంబ సభ్యులు.పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజనోవా, తనయుడు అకిరా నందన్( Akira Nandan) తో కలిసి మెగాస్టార్ ఇంటికి వెళ్లగా మెగా ఫ్యామిలీ అంతా పూలు చల్లి స్వాగతం పలిపారు.ప్రేమగా హత్తుకొని పవన్ కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.
పవన్ చిరంజీవి కాళ్లకు నమస్కరించాడు.చిరంజీవి పవన్ ని హత్తుకున్నాడు.
చిరంజీవి పవన్ కు పెద్ద గజమాల వేసి పూల గుచ్చం ఇచ్చి స్వాగతం తెలిపారు.అలాగే పవన్ కళ్యాణ్ తన తల్లి అంజనమ్మ, తన వదిన సురేఖలకు కూడా పాదభివందనం చేశాడు.

పవన్ విజయంతో తల్లి అంజనా దేవి కన్నీళ్లు పెట్టడంతో పవన్ ప్రేమగా హత్తుకున్నాడు.దీంతో ఈ వీడియో వైరల్ అవ్వగా కొడుకు గెలిస్తే అమ్మ సంతోషం ఇది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇక మెగా ఫ్యామిలీ అంతా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.చిరంజీవి భార్య సురేఖ పవన్ కి, అకిరాకు, అన్నా లేజనోవాకు బొట్టు పెట్టి హారతి ఇచ్చింది.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కన్నుల పండుగగా ఉంది ఇది చాలా అద్భుతమైన దృశ్యం అంటూ కామెంట్లు చేస్తున్నారు మెగా అభిమానులు.







