టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో త్వరలో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.ఈ ప్రాజెక్టు కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.త్వరలోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించడంతోపాటు ఈ సినిమాను పట్టాలెక్కించనున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు జక్కన్న.అయితే అభిమానులు రాజమౌళి( Rajamouli ) సినిమా అనగానే అంచనాలు ఒక రేంజ్ లో పెట్టుకుంటే ఉంటారు.

కానీ ఒక్క విషయంలో మాత్రమే అభిమానులు నిరాశపడుతూ ఉంటారు.అదే సినిమా ఆలస్యం అవ్వడం.తన షూటింగ్‌లను పూర్తి చేయడానికి సంవత్సరాలు పడుతుంది.భారీ తనంతో నిండిన మేకింగ్ ప్రాసెస్ కాబట్టి సినిమాలు ఆలస్యం అవుతున్నాయి.అయితే రాజమౌళి ఈ సారి ప్రీ ప్రొడక్షన్ పనులకే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నాడని ప్రతి విషయంలో పిన్ టు పిన్ జాగ్రత్తలు తీసుకుంటున్నాడని సన్నిహిత సోర్స్ చెబుతోంది.ప్రీప్రొడక్షన్ పర్ఫెక్ట్ గా ఉంటే, షూటింగ్ పని ఈజీ అవుతుంది.
అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం మహేష్ బాబు సినిమా 2027 మొదటి త్రైమాసికంలో విడుదల చేయనున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

మహేష్ బాబు( Mahesh Babu ) ఈ సినిమా కోసం ఇప్పటికే చాలా ప్రిపరేషన్ సాగిస్తున్న సంగతి తెలిసిందే.ఫిజికల్ గా చాలా మార్పులు కనిపిస్తున్నాయి.లుక్ పూర్తిగా మారింది.
హనుమంతుని స్ఫూర్తితో ఒక పాత్రను పోషించడానికి మహేష్ బాబు బలమైన శరీరాకృతిని నిర్మించే పనిలో ఉన్నాడు.ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇంకా ఈ సినిమా కోసం మూడేళ్లు వెయిట్ చేయాలా అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్, ఫ్యాన్స్.