మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) సోలోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనదైన రీతిలో మంచి గుర్తింపును సంపాదించుకొని సుప్రీం హీరోగా ఎది గి ఆ తర్వాత మెగాస్టార్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఇండస్ట్రీలో తనకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కూడా కల్పించాయి.
ఇక తన తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఎమ్మెల్యేగా గెలిచిన విషయం మనందరికీ తెలిసిందే.ఈ గెలుపుని చిరంజీవి గారితో పంచుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఈరోజు పవన్ కళ్యాణ్ చిరంజీవి దగ్గరికి వెళ్లి ఆయన కాళ్ళ మీద పడి తన బ్లెస్సింగ్స్ ని అయితే తీసుకున్నాడు.

ఇక తన తమ్ముడిని దీవించడమే కాకుండా ఆయన ఉన్నత స్థానాలకి వెళ్లాలని కోరుకున్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే చిరంజీవి అంటే పవన్ కళ్యాణ్ కి విపరీతమైన ఇష్టం.అందువల్లే చిరంజీవి కోసం తను ఏదైనా చేయడానికి రెడీగా ఉంటాడు.ఆయన విషయంలో ఎవరైనా డీ గ్రెడ్ చేసి మాట్లాడితే పవన్ కళ్యాణ్ వెంటనే వాళ్లకు సమాధానం చెబుతాడు.
ఇక వజ్రోత్సవ వేడుకల్లో మోహన్ బాబు( Mohan Babu )చేసిన పనికి పవన్ కళ్యాణ్ ఎలా కౌంటర్ ఇచ్చాడో మనం అప్పుడు చూశాము./br>

అప్పుడనే కాదు చిరంజీవి గురించి ఎవరైనా బ్యాడ్ గా మాట్లాడితే మాత్రం వారికి కౌంటర్ ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు.ఇక ఎమ్మెల్యేగా తన కొత్త ప్రస్థానాన్ని మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ ఇక మీదట జనాలతో మమేకమై వాళ్ళ కష్టాలను వింటూ వాళ్లకి సేవ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాడు.చూడాలి మరి పవన్ కళ్యాణ్ కొత్త బాధ్యతను ఎలా నిర్వర్తిస్తాడు అనేది…ఒక వేళ పవన్ కళ్యాణ్ బెస్ట్ ఎమ్మెల్యే గా ఉంటే మాత్రం ఇక మీదట కూడా ఆయనే రాజకీయంగా చాలా స్ట్రాంగ్ గా ముందుకు వెళ్తాడు…
.







