తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎనర్జిటిక్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నా నటుడు రామ్ పోతినేని( Ram Pothineni).ఇక ప్రస్తుతం ఆయన పూరి జగన్నాధ్ దర్శకత్వంలో డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా చేస్తున్నాడు.
అయితే ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నప్పటికీ ఆ సినిమా తర్వాత రామ్ ఎవరితో సినిమా చేయాలి అనే ఆలోచనలో పడ్డట్టుగా తెలుస్తుంది.

ఇక ఇప్పటికే ఆయన పలువురు దర్శకులను లైన్ లో పెట్టినట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.ఇక ముఖ్యంగా రామ్ త్రివిక్రమ్( Trivikram ) తో ఒక సినిమా చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాడు.కానీ వీళ్ళ కాంబో మాత్రం సెట్ అవ్వడం లేదు.
ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం వీళ్ళ కాంబో లో ఒక సినిమా రాబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి.ఇక కిషోర్ తిరుమల దర్శకత్వంలో కూడా ఆయన ఒక సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఇప్పటికే కిషోర్ తిరుమల దర్శకత్వంలో నేను శైలజా, ఉన్నదొక్కటే జిందగీ లాంటి రెండు సినిమాలను చేసిన రామ్ ఈ రెండు సినిమాలు కూడా విమర్శకుల ప్రశంసలు అయితే అందుకున్నాయి.

ఇక రెడ్ సినిమా కూడా కిషోర్ తిరుమల ( Kishore Tirumala )దర్శకత్వంలోనే చేశాడు.అయితే ఈ సినిమా అనుకున్నంత విజయాన్ని సాధించలేదు.దాంతో మరోసారి వీళ్ళ కాంబో సెట్స్ మీదికి రాబోతున్నట్టుగా తెలుస్తుంది.
అయితే రామ్ తన తదుపరి సినిమాలన్నింటిని లైన్ లో పెట్టినప్పటికి వాటిని అనౌన్స్ చేయడానికి మాత్రం సంకోచిస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక డబుల్ ఇస్మార్ట్ సినిమా పూర్తి అయన తర్వాత ఆయన చేస్తున్న సినిమాల అనౌన్స్ మెంట్ గురించిన ప్రస్తావనను తీసుకురావాలనే ఉద్దేశ్యం లో తను ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఇక గత సంవత్సరం రామ్ చేసిన స్కంద సినిమా భారీ డిజాస్టర్ అందుకోవడంతో ఇక మీదట చేసే సినిమాల పట్ల ఆయన కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది…
.