సిరిసిల్ల తెలుగుదేశం పార్టీ విజయోత్సవ సంబరాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆంధ్రప్రదేశ్ శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడంను హర్షిస్తూ తెలుగుదేశం పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ కార్యాలయంలో ఇంచార్జ్ ఆవునూరి దయాకర్ రావు ఆధ్వర్యంలో స్వీట్లు పంపిణీ చేసుకుని సంబరాలు నిర్వహించుకోవడం జరిగింది.ఈ సందర్భంగా దయాకర్ రావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చారిత్రాత్మకమైన విజయం సాధించడం గొప్ప విషయం అని ఐదేళ్ల అవినీతి అక్రమాల ప్రభుత్వానికి అవినీతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దిమ్మతిరిగే తీర్పును ప్రజలు ఇచ్చారని నేటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా పరిపాలన సాగించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కోలుకోలేని విధంగా ప్రజలు గుణపాఠం చెప్పటం ఆయన అసమర్ధత పరిపాలనకు ఓ నిదర్శనం అని అన్నారు.

 Sirisilla Telugu Desam Party Victory Celebrations , Telugu Desam Party, Sirisill-TeluguStop.com

రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ బలోపేతానికి నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఇట్టి కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు తీగల శేఖర్ గౌడ్,కరీంనగర్ పార్లమెంటు ఉపాధ్యక్షులు మచ్చ ఆంజనేయులు,రాష్ట్ర కార్యనిర్వహ కార్యదర్శి దామెర సత్యం,బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి మ్యాన వెంకటేశం,టి,ఎన్,ఎస్,ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు మోతె రాజిరెడ్డి,కడారి రాంరెడ్డి,బింగి వెంకటేశం గుజ్జె అశోక్,శ్యాగ ప్రశాంత్,దత్తాద్రి, లక్ష్మణ్, సత్తయ్య,నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube