ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలాగే సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో నందమూరి బాలకృష్ణ( Balakrishna ) పేరు కూడా ఒకటి.బాలయ్య బాబు అటు సినిమాల పరంగా ఇటు రాజకీయపరంగా ఫుల్ యాక్టివ్ గా ఉండడంతో పాటు రెండింటిలోనూ వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు.
కాగా బాలయ్య బాబు గత మూడు సినిమాలు వరుసగా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే.

బాలయ్య బాబు నటించిన భగవంత్ కేసరి, ( Bhagavanth Kesari ) అఖండ,( Akhanda ) వీర సింహారెడ్డి( Veerasimha Reddy ) సినిమాలు ఒకదానిని మించి ఒకటి సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.తాజాగా హిందూపురం ప్రజల ఆశీర్వాదంతో మరొకసారి ప్రజాప్రతినిధిగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు బాలయ్య బాబు.ఇప్పటికే హిందూపురంలో బాలయ్య బాబు ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే.
తాజాగా విడుదల అయిన ఏపీ ఎన్నికలలో మరొకసారి ఎమ్మెల్యేగా గెలిచి తన సత్తాను నిరూపించుకున్నారు బాలయ్య బాబు.ఈ విధంగా అటు సినిమాలలో ఇటు రాజకీయాలలో రెండింటిలోనూ బాలయ్య బాబు సక్సెస్ ఫుల్ గా రాణిస్తూ దూసుకుపోతున్నారు.

ఇప్పుడు పాలిటిక్స్ లోనూ( Politics ) ఇలాంటి ఫీట్ సాధించడం పట్ల అభిమానులు గర్వంగా ఫీలవుతున్నారు.ముప్పై వేలకు పైగా మెజారిటితో గత రెండు దఫాల కన్నా ఎక్కువ ఆధిక్యం సంపాదించడం చూస్తుంటే అక్కడి ప్రజల ప్రేమ, మద్దతు బలంగా దక్కించుకున్నట్టు అర్థమవుతోంది.బాలకృష్ణ ఆనందం దీంతో సరిపోవడం లేదు.ఒకపక్క చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించడం, ఇంకోవైపు అల్లుడు లోకేష్ మంగళగిరి నుంచి భారీగా గెలిచి శాసనసభలో కాలు మోపడం దాన్ని రెట్టింపు చేస్తున్నాయి.
అయితే ఇవన్నీ చూస్తుంటే బాలయ్య బాబుకు ప్రస్తుతం శుక్ర మహార్దశ నడుస్తోంది.అందుకే ఇలా వరుసగా హ్యాట్రిక్ లో అందుకుంటున్నారు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.







