తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ దిగ్గజ నిర్మాతల్లో అశ్వినీదత్( Ashwini Dutt ) కూడా ఒకరు.ఈయన ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్( Vyjayanthi Movies ) అధినేత అన్న విషయం మనందరికీ తెలిసిందే.
ఈ నిర్మాణ సంస్థలో ఎన్నో మంచి మంచి సినిమాలను నిర్మించి నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అశ్వనీదత్.ఇకపోతే ఈ నిర్మాణ సంస్థ నుంచి త్వరలోనే ఒక పాన్ ఇండియా సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.

ఆ సినిమా మరేదో కాదు ప్రభాస్ హీరోగా నటించిన కల్కి.( Kalki ) నాగ్ అశ్విన్, రెబల్ స్టార్ ప్రభాస్ ల కాంబినేషన్ లో చేస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ పై భారీగా అంచనాలు ఉన్నాయి.అయితే ఈ సినిమా విడుదల అంశంలో ఏపీ ప్రభుత్వ పాత్ర కూడా కీలక పాత్ర వహించింది.మరి నిన్న ఎన్నికల ఫలితాల్లో ప్రభాస్ అభిమానులు( Prabhas Fans ) అశ్వనీదత్ పై కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు కూడా చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
ఈ క్రమంలోనే అశ్వనీదత్ గారు చేసిన మరో సాలిడ్ స్టేట్మెంట్ వైరల్ గా మారింది.

ఎన్నికల్లో చాలా సర్వేలు, అంచనాలు వస్తూ ఉంటాయి అలాగే ఏపీలో కూటమి ఏకంగా 160 స్థానాలు సాధిస్తుంది అని దత్ గారు వక్కాణించారు.తీరా సీన్ కట్ చేస్తే నిజంగానే కూటమికి 160కి పైగా స్థానాలు వచ్చాయి.దీనితో అసలు సిసలైన ప్రిడిక్షన్ ఆయనదే అని తన కామెంట్స్ ఒక రేంజ్ లో వైరల్ అవ్వడం మొదలయ్యాయి.
దీంతో ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో పాటు భారీ విజయాన్ని అందుకోవడంతో అశ్విని దత్ మాటలు అంచనాలే నిజమయ్యాయి.ఆయన చెప్పినట్టే ఫలితాలు వచ్చాయి అంటూ కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.








