ఏపీ సార్వత్రిక ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పిఠాపురం ఎమ్మెల్యేగా 70 వేలకు పైగా ఓట్లతో గెలిచారు.అంతేకాదు జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని ఎమ్మెల్యే మరియు ఎంపీ స్థానాలలో అభ్యర్థులు గెలవడం జరిగింది.
దేశంలో 100 కి 100% గెలిచిన పార్టీగా జనసేన నిలిచిందని గెలుపు అనంతరం మంగళగిరి పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ స్పీచ్ ఇచ్చారు.ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తాజా విజయం పై సోషల్ మీడియాలో స్పందించారు.“ఆద్య, అకీరాలు( Adya , Akira ) సంతోషంగా ఉన్నారు.ఈ తీర్పు వల్ల ఏపీ ప్రజలు ప్రయోజనం పొందుతారని ఆశిస్తున్నా” అని సోషల్ మీడియాలో తెలిపారు.“సెల్యూట్ ది కెప్టెన్” అని అఖీరా నందన్ పోస్ట్ చేసిన ఫోటోను రేణు దేశాయ్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నారు.
పిఠాపురంలో( Pithapuram ) పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలవడంతో మెగా కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు.మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ అని.మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని కొనియాడారు.తన తమ్ముడిని చూస్తే గర్వంగా ఉందని తన ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది.పవన్ గెలుపు కోసం తెలుగు చలనచిత్ర పరిశ్రమకి చెందిన చాలామంది నటీనటులు పిఠాపురంలో క్యాంపెయిన్ చేశారు.
దీంతో పిఠాపురంలో జనసేన గెలవడంతో వాళ్లంతా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది.పవన్ గెలుపు పట్ల తెలుగు ఇండస్ట్రీకి చెందిన చాలామంది ప్రముఖ నటీనటులు స్పందిస్తూ సంతోషం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలుపుతున్నారు.