జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) గురించి మనందరికీ తెలిసిందే.ఎన్టీఆర్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు.
ఇకపోతే ఎన్టీఆర్ నటన డాన్స్ అలాగే ఆయన మంచితనం గురించి మనందరికీ తెలిసిందే.నందమూరి వారసుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని సినీ ఇండస్ట్రీలో స్టార్ గా ఎదిగాడు తారక్.
అంతేకాకుండా అన్ని విషయాల్లో మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు తాతకు దగ్గర మనవడు అనిపించుకున్నాడు తారక్.ఎన్టీఆర్ కీ ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
చిన్న పిల్లాడిని అడిగినా ఎన్టీఆర్ గురించి చెప్తాడు.
ఎన్టీఆర్ మొన్నటి వరకు టాలీవుడ్ స్టార్ హీరోగా ఉన్న తారక్ ఆర్ఆర్ఆర్( RRR ) సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.
తన నటనతో విదేశాల్లో ఉన్న ప్రేక్షకులను కూడా అబ్బురపరిచాడు.ఇతర దేశాల్లోనూ ఎన్టీఆర్ కు మంచి ఫ్యాన్ బేస్ ఉంది.ఎంత ఎదిగిన ఎన్టీఆర్ ఎంతో ఒదిగి ఉంటాడు.స్టార్ అనే గర్వం లేకుండా తన తోటివారితో సరదాగా ఉంటాడు.
ఇవి ఇండస్ట్రీలో చాలా మంది చాలా సందర్భాల్లో చెప్పిన మాటలే.తాజాగా ఒక సీనియర్ నటి కూడా తారక్ పై ప్రశంసలు కురిపించారు.
ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించారు నటి సుధ.( Sudha )
అమ్మగా, అత్తగా, వదినగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇలా ఎన్నో పాత్రలో నటించి మెప్పించింది.సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సుధ,ఎన్టీఆర్ గురించి ఒక ఆసక్తికర విషయాన్నీ చెప్పారు.ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.
ఎన్టీఆర్ తో కలిసి చాలా సినిమాలు చేశాను.అలాగే శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన బాద్షా సినిమాలోనూ( Baadshah Movie ) తారక్ తో కలిస్ చేశాను.
ఈ సినిమాలో ఒక డాన్స్ సన్నివేశం ఉంటుంది.ఎన్టీఆర్ తో కలిసి స్టేజ్ పై డాన్స్ చేయాలి.
అయితే ఒకసారి డాన్స్ చేసిన వెంటనే నేను మరో టెక్ చేద్దాం అని అన్నాను.వెంటనే తారక్ ఎందుకు అమ్మ మీరు బాగా చేశారు అని అన్నాడు.
నేను లేదు నాన్న మరో టెక్ చేద్దాం అని చెప్పి చేస్తున్నాం ఇంతలో కాలు స్లిప్ అయ్యింది.వెంటనే కింద పడ్డాను కాలు బాగా వాచిపోయింది.అంతే తారక్ వెంటనే వచ్చి నా కాలు పట్టుకున్నాడు.నేను వద్దు బాబు అంటున్నాకూడా మీరు ఉండండమ్మా నాకు అమ్మలాంటి వారు అని నా కాలు పట్టుకొని స్ప్రే తెప్పించి వాచిన దగ్గర స్ప్రే చేశాడు.
అతను ఒక స్టార్ అతనికి అవసరం లేదు ఎవరికైనా చెప్పి తాను వెళ్లిపోవచ్చు కానీ ఎంత మంచి వాడు అంటే నా కాలు పట్టుకొని నేను చెప్పాను కదమ్మా మొదటి టెక్ ఓకే చేయాల్సింది అంటూ వినయంగా, ఆప్యాయంగా మాట్లాడాడు.తారక్ నిజంగా గ్రేట్ అంటూ సుధా చెప్పుకొచ్చారు.