టాలీవుడ్ ఇండస్ట్రీలో తొలి మూడు సినిమాలతో హ్యాట్రిక్ విజయాలు అందుకున్న హీరోలు కొద్దిమంది మాత్రమే ఉన్నారు.అందులో అల్లు అర్జున్,( Allu Arjun ) ఉదయ్ కిరణ్ లు( Uday Kiran ) కూడా ఒకరు.
అల్లు అర్జున్ విషయానికొస్తే.గంగోత్రి చిత్రంలో అల్లు అర్జున్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు.
రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన గంగోత్రి( Gangotri ) మ్యూజికల్ సూపర్ హిట్ గా నిలిచింది.ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆర్య( Arya ) ట్రెండ్ సెట్ చేసింది.
ఆ తర్వాత వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన బన్నీ( Bunny ) లాంటి చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి.
చిత్రం మాస్ హిట్ గా నిలిచింది.ఇలా అల్లు అర్జున్ తొలి మూడు చిత్రాలతో సూపర్ హిట్స్ కొట్టి కెరీర్ ని ఘనంగా ప్రారంభించాడు.అలాగే హీరో రాజ్ తరుణ్ కూడా ఉయ్యాలా జంపాల, సినిమా చూపిస్త మావ, కుమారి 21 ఎఫ్ చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలు అందుకున్నాడు.
టాలీవుడ్ దివంగత హీరో ఉదయ్ కిరణ్( Uday Kiran ) ఎంత ఘనంగా కెరీర్ ని ప్రారంభించారో అంతే విషాదంగా ముగించారు.చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే చిత్రాలు యూత్ ఫుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి.
తొలి మూడు చిత్రాలు హ్యాట్రిక్ హిట్స్ కావడంతో ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ పేరు మారుమోగింది.కానీ ఆ తర్వాత ఉదయ్ కిరణ్ కెరీర్ అంతకంతకూ దిగజారుతూ వచ్చింది.కేవలం వీరు మాత్రమే కాకుండా అడివి శేషు, నాని,నవీన్ పొలిశెట్టి లాంటి హీరోలు కూడా వరుసగా హ్యాట్రిక్లను అందుకున్నారు.