సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) కెరీర్ లో కృష్ణ పుట్టినరోజు( Krishna Birthday ) ఎంతో ప్రత్యేకం అనే సంగతి తెలిసిందే.కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబుకు సంబంధించిన చాలా సినిమాల అప్ డేట్స్ రావడం గమనార్హం.
ఈరోజు కృష్ణ పుట్టినరోజు కావడంతో నాన్నను తలచుకుంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు పెట్టిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.ప్రతి జ్ఞాపకంలోనూ మీరుంటారంటూ తండ్రిని గుర్తు చేసుకుంటూ మహేష్ బాబు ఎమోషనల్ అయ్యారు.
“పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న.మిమ్మల్ని ప్రతి క్షణం మిస్ అవుతున్నాను.
నా ప్రతి జ్ఞాపకంలోనూ మీరు ఎప్పటికీ జీవించి ఉంటారు” అని మహేష్ బాబు పేర్కొన్నారు.కృష్ణ యంగ్ లుక్ లో ఉన్న ఫోటోను మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం జరిగింది.
మహేష్ బాబు చేసిన పోస్ట్ కు రికార్డ్ స్థాయిలో లైక్స్ వస్తుండటం గమనార్హం.కృష్ణ వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన మహేష్ బాబు తన టాలెంట్ తో అంతకంతకూ ఎదుగుతున్నారు.

మరోవైపు ఈరోజు మహేష్ బాబు రాజమౌళి( Rajamouli ) కాంబో సినిమా నుంచి ఏదైనా క్రేజీ అప్ డేట్ ఉంటుందని భావించిన అభిమానులకు చివరకు నిరాశే మిగిలిందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మహేష్ బాబు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ వేరే లెవెల్ లో ఉండగా మహేష్ బాబు రెమ్యునరేషన్( Mahesh Babu Remuneration ) పరంగా కూడా టాప్ లో ఉన్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కృష్ణ పుట్టినరోజున కూడా మహేష్ రాజమౌళి మూవీ అప్ డేట్ లేనట్టేనని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.