ఎవరైనా నకిలీ విత్తనాలు నాణ్యతలేని విత్తనాలు అమ్మినట్లయితే వ్యవసాయశాఖ దృష్టికి తీసుకురావాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) వ్యవసాయ అధికారి వడ్డేపల్లి భాస్కర్ పోత్తూరు లోని విత్తన దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది.ప్రస్తుత వానాకాలం సీజన్ కు సంబంధించి పత్తి, ఇతర పంటల విత్తనాలు అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.

 Anyone Selling Fake Seeds And Poor Quality Seeds Should Be Brought To The Attent-TeluguStop.com

అదే విధంగా పత్తి విత్తనాలు అన్ని రకాల కంపెనీల నుంచి బోల్ గాడ్ 2 టెక్నాలజీ ( Bollgard II )లోనే ఉత్పత్తి చేయబడుతాయని, రైతులు , గమనించి ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసే రైతులు రెండు, మూడు రకాలైన హైబ్రిడ్ పత్తి రకాలను సాగు చేసుకోవాలని సూచించడమైనది.దిగుబడి అనేది వాతావరణ అనుకూలత, నేల స్వభావాన్ని బట్టి ఉంటుంది.

అన్ని రకాల బిజి 2 విత్తనాలు కాయ తొలుచు పురుగులను తట్టుకుంటాయి.ఈ విషయాన్ని రైతులు దృష్టిలో ఉంచుకొని పత్తి విత్తనాలు కొనుగోలు చేయవలసిందిగా సూచించారు.

అదేవిధంగా ఎవరైనా నకిలీ పత్తి విత్తనాలు( Duplicate cotton seeds ), నాణ్యతలేని పత్తి విత్తనాలు అమ్మినట్లయితే వ్యవసాయ శాఖ దృష్టికి తీసుకురావాల్సిందిగా జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ తెలియచేయడం జరిగింది.ఈ తనిఖీ లో జిల్లా వ్యవసాయ అధికారి తో పాటు మండల వ్యవసాయ అధికారి సురేష్ రెడ్డి కూడా పాల్గొనడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube