సిరిసిల్ల జిల్లా :రైతులు( Farmers) పంట విత్తనాలు సాగుకు కొనేటప్పుడు జాగ్రత్త వహించాలని ఎల్లారెడ్డిపేట మండల వ్యవసాయ అధికారి భూంరెడ్డి అన్నారు.బుధవారం ఉమ్మడి మండలంలోని తిమ్మాపూర్,సింగారం,వీర్నపల్లి,పోతిరెడ్డి పల్లి,బుగ్గ రాజేశ్వర తండా,రాగట్ల పల్లి,రంగం పేట గ్రామాల రైతులకు వ్యవసాయ విస్తీర్ణ అధికారులతో కలిసి పర్యటించి విత్తనాల( Seeds ) కొనుగోల్ల పై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ వానకాలంలో సీజన్లో వేసే పంటలకు సంబంధించి రైతులు ఓపెన్ చేసిన బ్యాగునుండి విత్తనాలు కొనద్దని కొనుగోలు చేసిన షాప్ నుండి రశీదు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.అదేవిదంగా వ్యవసాయ శాఖ వద్ద గుర్తింపు పొందిన డీలర్ల వద్దనే కొనుగోలు చేయాలని తీసుకున్న బిల్ మీద విత్తన కంపని పేరు,విత్తన రకం,బ్యాచ్ నంబర్,లాట్ నంబర్ ఉండేల చూసుకోవాలన్నారు.
విత్తన ప్యాకెట్ల మీద ఎక్స్పైడ్ డేట్ గమనించాలని పేర్కొన్నారు.ఈ పర్యటనలో ఏఈఓలు ముకుంద కుమార్, శ్రీశైలం, మసూద్,లక్ష్మణ్,అనూష,శ్రీధర్ రెడ్డి,ఫజిల్ పాల్గొన్నారు.