ఏపీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పై కేంద్ర ఎన్నికల సంఘం( Central Election Commission ) సూచనలు చేయడం జరిగింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలుకానుంది.
ఈ క్రమంలో ఎలాంటి హింసాత్మక ఘటనలకు తావు లేకుండా చూడాలని ఈసీ ఉన్నత అధికారులు.ఢిల్లీ నుంచి పలుమార్లు సమీక్షలు నిర్వహిస్తున్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు అనుగుణంగా ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టేలా ఎన్నికల కమిషన్ లోని డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ సమీక్ష జరిపారు.ఖచ్చితమైన ఫలితాల ప్రకటన, శాంతిభద్రతల పరిరక్షణకు నియోజకవర్గం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆరా తీశారు.

ఈ సమావేశంలో ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా,( Mukesh Kumar Meena ) రాష్ట్ర పోలీస్ నోడల్ అధికారి.సహా అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు హాజరయ్యారు.కౌంటింగ్ కేంద్రాల వద్దకు ఇతరులను అనుమతించవద్దని కూడా ఈసీ అధికారులు స్పష్టం చేయడం జరిగింది.అదేవిధంగా క్రౌడ్ మేనేజ్మెంట్ సిస్టం.భద్రతా వ్యవస్థలో లోపాలు లేకుండా చూసుకోవాలని సూచించారు.హింసాత్మక ఘటనలు జరగకూడదని ఎస్పీలను ఆదేశించడం జరిగింది.
పోలింగ్ అనంతరం రాయలసీమ మరియు పల్నాడు పలు ప్రాంతాలలో జరిగిన హింస విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈసారి 80 శాతానికి పైగా పోలింగ్ నమోదయింది.
దీంతో ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తికరంగా ఉంది.ప్రధానంగా వైసీపీ…టీడీపీ కూటమి మధ్య పోటీ ఉంది.
ఈ క్రమంలో గెలుపు విషయంలో ఇరువురు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.మరి ఏపీ ప్రజలు ఎవరికి పట్టం కట్టారు అన్నది జూన్ 4న తెలియనుంది.