ఈ ఒక్క విషయంలో నమ్రత ఎందుకు ఇలా చేస్తుంది ?

నమ్రతా శిరోద్కర్( Namrata Shirodkar )… ఘట్టమనేని ఇంటి కోడలు మహేష్ బాబుకి భార్య.ఈమె గీత గీస్తే ఆ ఇంట్లో ఎవరూ కూడా గీత దాటడానికి సాహసించరు.

 Why Namratha Behaving Like This, Namrata Shirodkar , Mahesh Babu, Tollywood ,-TeluguStop.com

మహేష్ బాబు నుంచి ప్రతి ఒక్కరూ నమ్రత ఎలా చెప్తే అలా నడుచుకుంటారు.రెమ్యునరేషన్ విషయమైనా లేదంటే మహేష్ కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి నమ్రత డిసైడ్ చేసినట్టుగానే ఉంటుంది.

బయట ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళాలి అన్న పబ్లిక్ మీటింగ్ లో ఉన్నా కూడా నమ్రత చెప్పినట్టుగానే మహేష్ మాట్లాడుతాడు.ఇది టాలీవుడ్ లో ప్రతి ఒక్కరికి తెలుసు.

అందుకే చాలామంది మహేష్ బాబు కన్నా కూడా నమ్రతను ప్రసన్నం చేసుకోవాలని తెలుగు సినిమా ఇండస్ట్రీలో అనుకుంటూ ఉంటారు.ఈ మధ్యకాలంలో మహేష్ బాబు( Mahesh Babu )తో బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా నమ్రత ఐడియా అని అందరూ అనుకుంటున్నారు.

Telugu Goutham, Mahesh Babu, Sitara, Tollywood-Movie

సరే కాసేపు వారి సినిమా, బిజినెస్ వ్యవహారాల సంగతి పక్కన పెడితే, నమ్రత మహేష్ బాబుల గారాల పట్టి సితార( Sitara) గురించి నమ్రత ప్రవర్తిస్తున్న విధానం పైనే చాలామందికి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.ఆరవ తరగతి చదువుతున్న 12 ఏళ్ల సీతార ను మీడియాలో ఎంత వరకు హైలైట్ చేయకూడదు అంత వరకు చేస్తుంది నమ్రత.నిజానికి ఎవరికైనా సినిమా ఇండస్ట్రీలో ఉండే వారి పిల్లలకు వారి తల్లిదండ్రుల గ్లామర్ ఫీల్డ్ లో చూసిన తర్వాత వారికి కూడా ఈ ఇండస్ట్రీ కి రావాలనే ఉంటుంది.అయితే నమ్రత మాత్రం సితారను ఒక మనీ మేకింగ్ మిషన్ లా మార్చేసింది అంటారు కొంతమంది.

Telugu Goutham, Mahesh Babu, Sitara, Tollywood-Movie

బంగారం యాడ్ ఇటీవల చేసి కోట్లలో పారితోషకం తీసుకున్న సితార.ఇక ఇటీవల కొన్ని రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది.డిజిటల్ సెలబ్స్ అందరి తో కూర్చోబెట్టి ఆమె ముందు ప్రశ్నల వర్షం కురిపించారు.ఒక్కోసారి ఆమె ఎలాంటి సమాధానం చెప్పలేక కంగారుపడుతూ ఉంది.ఇంత చిన్న పిల్లను అలా పబ్లిక్ లో జనాల ముందు కూర్చోపెట్టి, పిచ్చి పిచ్చి ప్రశ్నలకు సమాధానాలు చెప్పమంటే ఎలా ఉంటుంది.నమ్రత ఈ విషయంలో తప్పు చేసింది అనేది కొంతమంది అభిప్రాయం.

ఇక వారు అడుగుతున్న ప్రశ్నలు చూస్తే నవ్వాలని లేదు మీ నాన్న ఎందుకు జుట్టుని ముట్టుకుంటే ఇష్టపడడు, మీ అమ్మ ఎలా ఉంటుంది, మీ అన్నయ్య ఏం తింటాడు ఈ ప్రశ్నలకు సితార చేత సమాధానాలు చెప్పించాల్సిన అవసరం ఏముంది.అంతా కలికాలం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube