సాధారణంగా ఒక్కోసారి అనుకోని ఆహ్వానాలు తగులుతుంటాయి.వాటిని కాదనలేము.
తప్పకుండా హాజరు కావాల్సిందే.కానీ అలాంటి సమయంలో ముఖ చర్మం డల్ గా, నిర్జీవంగా ఉంటే కాలు తీసి బయట పెట్టడానికి కూడా ఇష్టపడరు.
అయితే అప్పటికప్పుడు ముఖాన్ని అందంగా, కాంతివంతంగా మార్చేందుకు కొన్ని కొన్ని ఇంటి చిట్కాలు చాలా అద్భుతంగా సహాయపడతాయి.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ ( Home remedy )కూడా ఆ కోవకే చెందుతుంది.
ఈ రెమెడీ ద్వారా నిమిషాల్లో స్కిన్ ను బ్యూటిఫుల్ గా మరియు గ్లోయింగ్ గా మెరిపించుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ గురించి పూర్తిగా తెలుసుకుందాం పదండి.
ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో మూడు నుంచి నాలుగు పీల్ తొలగించిన బొప్పాయి పండు ముక్కలు( Papaya slices ) వేసుకుని ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి.అలాగే చిన్న కీర దోసకాయను ( Green cucumber )సన్నగా తురిమి జ్యూస్ ను ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ముల్తానీ మట్టి( Multani soil ), వన్ టేబుల్ స్పూన్ చందనం పొడి,( sandalwood powder ) రెండు టేబుల్ స్పూన్లు బొప్పాయి పండు ప్యూరీ, రెండు టేబుల్ స్పూన్లు కీరా దోసకాయ జ్యూస్ మరియు వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.ఈ సింపుల్ ప్యాక్ వల్ల చాలా బెనిఫిట్స్ పొందుతారు.
బొప్పాయి, కీర దోసకాయ చర్మాన్ని మృదువుగా మరియు కాంతివంతంగా మారుస్తాయి.చర్మాన్ని హైడ్రేట్ చేస్తాయి.
స్కిన్ టోన్ ను ఇంప్రూవ్ చేస్తుంది.

అలాగే చందనం పొడి, ముల్తాని మట్టి మీ చర్మం ఆరోగ్యంగా, యవ్వనంగా మరియు ప్రకాశవంతంగా కనిపించడానికి సహాయపడతాయి.చర్మం నుండి అదనపు నూనెను తొలగిస్తాయి.తేనె చర్మాన్ని తేమగా ఉంచుతుంది.
సూపర్ గ్లోయింగ్ గా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.కాబట్టి అప్పటికప్పుడు అందంగా కాంతివంతంగా మెరిసిపోవాలి అనుకున్నప్పుడు కచ్చితంగా ఈ హోమ్ రెమెడీని ప్రయత్నించండి.