ఏపీ ముఖ్య నేతలంతా విదేశాల్లోనే 

ఎన్నికల వ్యూహాలు,  ఎన్నికల ప్రచారాలు , అభ్యర్థుల ఎంపిక , పోల్ మేనేజ్మెంట్ , ఇలా ఎన్నో వ్యవహారాలతో క్షణం తీరిక లేదన్నట్లుగా గడిపిన ఏపీలోని రాజకీయ ప్రముఖులంతా ఇప్పుడు సేద తీరుతున్నారు.స్థానికంగా నాయకులకు అందుబాటులో ఉంటే కుటుంబ సభ్యులతో గడిపేందుకు పెద్దగా సమయం ఉండదనే ఆలోచనతో వివిధ పార్టీల ముఖ్య నేతలంతా కుటుంబ సమేతంగా విదేశాలకు వెళ్లారు.

 All The Main Leaders Of Ap Are Abroad, Ap Elections, Cbn, Chandrababu,ap Governm-TeluguStop.com

మళ్ళీ ఎన్నికల ఫలితాలు వెలువడే నాటికి మీరంతా వెనక్కి రానున్నారు.వైసీపీ అధినేత , ఏపీ సీఎం జగన్( Ap CM Jagan) ఇప్పటికే తన భార్య భారతి తో కలిసి లండన్ కు వెళ్లారు.

Telugu Ap, Chandrababu, Devansh, Jagan, Jagan London, Lokesh, Brahmani, Ys Bhara

అక్కడ చదువుతున్న తన కుమార్తెలతో గడిపేందుకు జగన్ వెళ్లారు.ఇక టిడిపి అధినేత చంద్రబాబు(Chandrababu) ఆయన భార్య భువనేశ్వరి(Bhuvaneshwari) అమెరికాకు వెళ్లారు.చంద్రబాబు వైద్య పరీక్షల నిమిత్తం అమెరికా వెళ్లినట్లుగా టిడిపి వర్గాలు పేర్కొంటున్నాయి.అక్కడే కొద్దిరోజులు చంద్రబాబు విశ్రాంతి తీసుకుంటారు .ఇక నారా లోకేష్ , ఆయన భార్య నారా బ్రాహ్మణి , కుమారుడు దేవాన్ష్ అమెరికాకు ఈనెల 16నే వెళ్లారు.మళ్లీ 25 ,26 తేదీలలో లోకేష్ తిరిగి రానున్నారు.

ఇక ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ( Ys Sharmila) కూడా అమెరికాకు వెళ్లారు.అక్కడే ఉంటున్న తన కుమారుడు, తన తల్లి వైఎస్ విజయమ్మ ను చూసేందుకు ఆమె అమెరికాకు వెళ్లారు.

Telugu Ap, Chandrababu, Devansh, Jagan, Jagan London, Lokesh, Brahmani, Ys Bhara

మళ్ళీ జూన్ రెండో తేదీ నాటికి ఆమె ఏపీకి రానున్నారు.గత రెండు మూడు నెలలుగా పూర్తిగా ఎన్నికల ప్రచారంలో బిజీగా గడిపిన నాయకులంతా బాగా అలసిపోవడంతో ఇప్పుడు విదేశీ పర్యటనల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.ఎప్పటికప్పుడు ఏపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను తెలుసుకుంటూ.  పార్టీ కీలక నాయకులను ఆ వ్యవహారాలను చక్కబెట్టాల్సిందిగా బాధ్యతలను అప్పగించారు.జూన్ 4వ తేదీ నాటికి ఎన్నికల ఫలితాలు వెలువడబోతుండడంతో అంతకంటే ముందుగానే ఏపీకి చేరుకుని రాజకీయ వ్యవహారాలను చక్కదిద్దనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube