పల్నాడు జిల్లాలో( Palnadu District ) చోటు చేసుకున్న ఘటనపై సిట్ అధికారులు( SIT ) స్పెషల్ ఫోకస్ పెట్టారు.ఈ మేరకు మాచర్లలో ఈవీఎం( EVM ) ధ్వంసం ఘటనపై ఎస్పీ ఆధ్వర్యంలో సిట్ విచారణ చేపట్టింది.
ఈవీఎం ధ్వంసం వెనుక కుట్ర కారణాలు ఏమైనా ఉన్నాయా? లేక ఇతర కారణాలు ఉన్నాయా? అనే కోణంలో సిట్ విచారణ జరుపుతుంది.ఈవీఎంను ఎమ్మెల్యే పిన్నెల్లి( MLA Pinnelli ) ధ్వంసం చేసిన వీడియో బయటకు ఎలా వచ్చిందనే విషయంపైనా సిట్ అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఘటనపై సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్ బృందం సమగ్ర నివేదిక సిద్ధం చేస్తుంది.