ఏపీలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనే సంకేతాలతో ఆ పార్టీలో నాయకులు ఒక్కొక్కరుగా వాయిస్ పెంచుతున్నారు .టిడిపి( TDP ) ఈ స్థాయిలో బలోపేతం కావడానికి , ఎన్నికల్లో ఇంత ఉత్సాహంగా నాయకులు పనిచేయడానికి, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) కారణమని, ఆయన పాదయాత్ర చేపట్టి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెంచి టిడిపి పై ప్రజల్లో ఆదరణ పెరిగేలా చేశారని , ఆ పార్టీ నాయకులు బలంగా నమ్ముతున్నారు .
ఈ నేపథ్యంలోనే టిడిపి అధ్యక్ష బాధ్యతలను నారా లోకేష్ కు అప్పగించాలనే డిమాండ్ కొత్తగా తెరపైకి వచ్చింది. ఈ మేరకు టిడిపి సీనియర్ నేత బుద్ధ వెంకన్న( Buddha Venkanna ) తాజాగా దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చూస్తున్న అచ్చెన్న నాయుడు( Atchennaidu ) కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు( Chandrababu ) క్యాబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉండడంతో , ఈ అధ్యక్ష పదవిని లోకేష్ కు అప్పగించాలని బుద్ధ వెంకన్న కొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చారు ఇది రిక్వెస్ట్ కాదు అని మా డిమాండ్ అంటూ బుద్ధ వెంకన్న వ్యాఖ్యానిస్తున్నారు.టిడిపి కూటమి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా లోకేష్ కు క్యాబినెట్ లో మంత్రి పదవి దక్కడం ఖాయం. దీంతో పాటు పార్టీ అధ్యక్ష బాధ్యతలు లోకేష్ కు అప్పగిస్తే, టిడిపికి తిరుగు ఉండదని , లోకేష్ ప్రాధాన్యం పార్టీలో మరింతగా పెరుగుతుందనే ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు ఈ నేపథ్యంలోనే లోకేష్ కు చంద్రబాబుకు సన్నిహితుడుగా ముద్ర పడిన విజయవాడ నేత బుద్ధ వెంకన్న ఈ డిమాండ్ ను వినిపిస్తున్నారు.
ఇప్పటికే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి గా నారా లోకేష్ ఉన్నారు.ఏపీ టీడీపీ అధ్యక్ష బాధ్యతలు ఆయనకు అప్పగిస్తే మరింత సమర్థవంతంగా పార్టీని ముందుకు తీసుకెళ్లడంతో పాటు, పార్టీలో లోకేష్ మాటకు తిరుగులేకుండా ఉంటుందని, రాబోయే రోజుల్లో చంద్రబాబు యాక్టివ్ వా ఉన్నా లేకపోయినా అప్పటికి లోకేష్ బలమైన నాయకుడిగా తయారు అయ్యే అవకాశం ఉంటుందనే అభిప్రాయంతోనే తాజాగా బుద్ధ వెంకన్న ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా అర్ధం అవుతోంది.