బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలి( Sanjay Leela Bhansali ) గురించి మనందరికి తెలిసిందే.బాలీవుడ్ లో ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి డైరెక్టర్గా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు సంజయ్.
ఈయన కేవలం సినిమాకు సంబందించిన విషయాలలో మాత్రమే కాకుండా అప్పుడప్పుడు ఇతర విషయాల్లో కూడా సోషల్ మీడియాలో నిలుస్తూ ఉంటారు.కాగా భారతీయ సినిమా గర్వించదగిన దర్శకుల్లో సంజయ్ లీలా బన్సాలి కూడా ఒకరు అనడంలో ఎటువంటి సందేహం లేదు.
కాగా ఈయన ఇటీవల హీరామండి ది డైమండ్ బాజార్( Heeramandi ) అనే ఒక వెబ్ సిరీస్ ని తెరకెక్కించారు.
ప్రస్తుతం అది నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే.ఆ చిత్ర కథ వేశ్య వృత్తి చేసుకునే ఆడవాళ్ళ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది.అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న భన్సాలీ ని మీ సినిమాల్లో ఎక్కువ భాగం వేశ్య వృత్తి చేసుకునే ఆడవాళ్ళ గురించే ఉంటాయేందుకనే ప్రశ్న అడిగారు.
సెక్స్ వర్కర్ల పాత్రలని వెండి తెరపై ఆవిష్కరించడం నాకు ఎంతో ఆసక్తి.ఆ వృత్తుల్లో ఉన్న మహిళలు అంతులేని రహస్యాలకి చిరునామా.అలాగే వేశ్య వృత్తిలో అందరి కంటే ఉన్నత స్థానంలో ఉన్న మహిళలో నిగూడ శక్తీ దాగి ఉంటుంది.అలాగే వారు చాలా గమ్మత్తుగా ఉండటంతో పాటు పాడగలరు.
అంతే కాదు డాన్స్ చేయగలరు.అమితమైన ఆనందాన్ని పొందటం కోసమే వాళ్ళు అలా చేస్తారు.కళాత్మకంగా జీవిస్తూ తమ భావాలని చాలా ఈజీగా కూడా వ్యక్తం చేస్తారు.వారు ఉండే ప్రాంతానికి, దుస్తులకి, అభరణాలకి విశేష ప్రాముఖ్యతని ఇస్తారు.మంచి రస హృదయులు కూడా మీరు వాళ్ళని ఏ పేరుతో పిలిచినా పరవాలేదు.నా సినిమాకి మాత్రం వాళ్లే కావాలి అంటూ వేశ్యలపై తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు సంజయ్.