రైలు ట్రాక్‌ల చోరీ.. యూకేలో భారత సంతతి స్క్రాప్ డీలర్‌కు జైలు శిక్ష

రైలు పట్టాలను దొంగిలించిన నేరంపై భారత సంతతి వ్యక్తి సహా ఏడుగురికి యూకే కోర్ట్( UK Court ) జైలు శిక్ష విధించింది.నిందితుడిని జస్‌ప్రీత్ ఒబెరాయ్ (40)గా గుర్తించారు.2022 నుంచి జరుగుతున్న ఈ కేసు విచారణ ముగిసి ఆయనను న్యాయస్థానం తాజాగా దోషిగా తేల్చింది.దొంగతనం, కుట్ర సహా రెండు నేరారోపణలపై ఒబెరాయ్ నేరాన్ని అంగీకరించాడు.

 Indian-origin Scrap Metals Dealer Jailed In Uk's Train Track Conspiracy ,indian-TeluguStop.com

దీంతో ఆయనకు ఇటీవల షెఫీల్డ్ క్రౌన్ కోర్టులో 30 నెలల జైలుశిక్ష పడింది.క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ (సీపీఎస్) ఈ కేసులో మూడు ట్రయల్స్‌లో జస్‌ప్రీత్ ఒబెరాయ్ డైరెక్టర్‌గా ఉన్న జేఎస్‌జే మెటల్ రీసైక్లింగ్ లిమిటెడ్( JSJ Metal Recycling Ltd) …దొంగిలించబడిన రైలు ట్రాక్‌ల సేకరణకు ఏర్పాట్లు చేసినట్లు తేల్చింది.

Telugu Indian Origin, Jaspreet Oberoi, Jsj, Scrapmetals, Uk-Telugu NRI

ఈ కంపెనీయే దొంగిలించబడిన వస్తువులను స్క్రాప్ మెటల్‌గా చట్టబద్ధమైన కస్టమర్‌లు, వ్యాపార సంస్థలకు విక్రయించడం ద్వారా లాభాలను ఆర్జించినట్లు సీపీఎస్( CPS ) సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.వీరంతా నెట్‌వర్క్ రైల్ నుంచి దాదాపు 125 సందర్భాలలో దొంగతనానికి పాల్పడ్డారని సీపీఎస్ ఎకనామిక్ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇంటర్నేషనల్ డైరెక్టరేట్ స్పెషలిస్ట్ ప్రాసిక్యూటర్ స్టెఫాన్ పెండెర్డ్ చెప్పారు.నిందితులు దురాశతో దొంగతనాలకు పాల్పడ్డారని.వారి అక్రమ సంపాదనను రికవరి చేసేందుకు క్రైమ్ డివిజన్ సీపీఎస్ ప్రొసీడ్స్ ప్రక్రియను ప్రారంభిందని తెలిపారు.

Telugu Indian Origin, Jaspreet Oberoi, Jsj, Scrapmetals, Uk-Telugu NRI

2016 మే నుంచి నవంబర్ మధ్యకాలంలో జరిగిన ఈ దొంగతనాలకు సంబంధించి బ్రిటిష్ ట్రాన్స్‌పోర్ట్ పోలీసులు మరో కుట్రను వెలుగులోకి తీసుకొచ్చారు.ఇది నెట్‌వర్క్ రైల్ మేనేజర్ రికీ కాలిన్స్‌కు సంబంధించినది, అతను దొంగతనం చేయడానికి కుట్ర పన్నినట్లు నేరాన్ని అంగీకరించడంతో కోర్టు అతనికి 15 నెలల జైలు శిక్ష విధించింది.నిందితుడు కాలిన్స్.మిడ్‌లాండ్స్ మెయిన్‌లైన్ రైలు అప్‌గ్రేడ్‌ను పర్యవేక్షిస్తున్నాడు.థర్డ్ పార్టీల ద్వారా ఒబెరాయ్‌కు ట్రాక్‌‌లను నిల్వచేసిన వివరాలు పంచుకునేవాడని సీపీఎస్ తెలిపింది.కెట్టెరింగ్, మార్కెట్ హార్బరో, డెర్బీ, బర్టన్ ఆన్ ట్రెంట్ , బ్రేబ్రూక్‌ తదితర ప్రాంతాల్లో ఈ దొంగతనాలు జరిగినట్లు పేర్కొంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube