రాజన్న సిరిసిల్ల జిల్లా : రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్యంతో రైతులు పండించిన ధాన్యం అకాల వర్షాలతో కళ్ళాల్లోనే తడిసి మొలకెత్తుతున్న ఇప్పటికీ ధాన్యం కొనుగోలు లేక రైతులు నానా కష్టాలు పడుతున్నారని, ఇట్టి సమస్యపై బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ పిలుపు మేరకు బిజెపి పార్టీ ఆధ్వర్యంలో కళ్ళాల్లో నిలిచిపోయిన ధాన్యాన్ని, ఆకలా వర్షాలతో తడిచిన ధాన్యాన్ని భేషరతుగా ఎలాంటి ఆంక్షలు లేకుండా వెంటనే ధాన్యం కొనుగోలు చేపట్టాలని వేములవాడ ఆర్డీఓ కి వినతి పత్రం అందించారు.
కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, బిజెపి పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు, అర్బన్ మండల అధ్యక్షులు చింతపల్లి వేంకటేశ్వర రావు,కిసాన్ మోర్చ జిల్ల అధ్యక్షులు కోల కృష్ణ స్వామి, SC మోర్చ జిల్లా అధ్యక్షులు సంటి మహేష్, జిల్ల కార్యదర్శి బుర్ర శేఖర్ గౌడ్, గడ్డమీద శ్రీనివాస్, పినింటి హనుమండ్లు, జింక అనిల్, గుడిసె మనోజ్, వివేక్ రెడ్డి, రాజ్ కుమార్, సురువు వెంకట్, ప్రశాంత్, బిజెపి కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.