పల్నాడు జిల్లా( Palnadu District ) నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే ఇంటిపై దాడి జరిగిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.ఈ క్రమంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్( MLA Gopireddy Srinivas ) నివాసంపై కొందరు టీడీపీ కార్యకర్తలు( TDP Leaders ) దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది.
వెంటనే అప్రమత్తమైన పోలీసులు టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు.ఇందులో భాగంగానే రబ్బర్ బుల్లెట్లను పోలీసులు ప్రయోగించారని సమాచారం.అదేవిధంగా నరసరావుపేట మున్సిపల్ హైస్కూల్ పోలింగ్ కేంద్రాల్లోనూ టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చెలరేగింది.పోలింగ్ కేంద్రంలోకి వెళ్లొద్దని టీడీపీ కార్యకర్తలను వైసీపీ క్యాడర్ అడ్డుకుంది.
దీంతో పోలింగ్ కేంద్రం వద్ద హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.