కెనడా చరిత్రలోనే అతిపెద్ద చోరీగా నిలిచిన , టొరంటో ఎయిర్‌పోర్ట్‌లో లక్షలాది డాలర్ల విలువైన బంగారం దోపిడీకి సంబంధించి మరో భారత సంతతి వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.ఏప్రిల్ 17, 2023న 22 మిలియన్ కెనడియన్ డాలర్ల విలువైన బంగారు కడ్డీలు, విదేశీ కరెన్సీని మోసుకెళ్లే ఎయిర్‌కార్గో కంటైనర్‌లో( Air Cargo Container ) నకిలీ పత్రాలను ఉపయోగించి సురక్షిత నిల్వ కేంద్రం నుంచి దొంగిలించబడిందని పోలీసులు తెలిపారు.
స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ నుంచి టొరంటోని పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎయిర్ కెనడా విమానంలో( Air Canada Flight ) బంగారం, కరెన్సీలు వచ్చింది.
ఫ్లైట్ ల్యాండింగ్ అయిన కాసేపటికే, కార్గోను ఆఫ్ లోడ్ చేసి ఎయిర్‌పోర్టులోని ప్రత్యేక ప్రదేశానికి తరలించారు.కానీ ఆ మరుసటి రోజే అది కనిపించకుండా పోయిందని పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేశారు.ఈ ఘటనకు సంబంధించి 36 ఏళ్ల అర్చిత్ గ్రోవర్‌ను( Archit Grover ) టొరంటో విమానాశ్రయంలో అరెస్ట్ చేసి అభియోగాలు మోపారు.
అతని ఆచూకీ కోసం పోలీసులు కెనడా( Canada ) వ్యాప్తంగా వారెంట్ జారీ చేశారు.గ్రోవర్‌పై 5 వేల కెనడియన్ల డాలర్ల దొంగతనం, కుట్ర అభియోగాలు మోపినట్లు గురువారం పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.
అయితే బెయిల్ విచారణ కోసం గ్రోవర్ పట్టుబట్టి బ్రాంప్టన్‌లోని అంటారియో కోర్ట్ ఆఫ్ జస్టిస్( Ontario Court of Justice ) ఎదుట హాజరయ్యాడు.అతనిపై తుపాకీ కలిగివున్నట్లు అమెరికాలో అభియోగాలు వున్నాయి.
గత నెలలో అంటారియోకు చెందిన ఇద్దరు భారతీయ సంతతికి వ్యక్తులు పర్మ్‌పాల్ సిద్ధూ, అమిత్ జలోటా. అహ్మద్ చౌదరి, అలీ రజా, ప్రసాత్ పరమలింగంలను ఈ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అలాగే ఎయిర్ కెనడా ఉద్యోగి సిమ్రాన్ ప్రీత్ పనేసర్, మిస్సిసాగాకు చెందిన 42 ఏళ్ల అర్సాలాన్ చౌదరి కోసం కెనడా వ్యాప్తంగా వారెంట్లు జారీ చేశారు.పోలీసులు చెబుతున్న దానిని బట్టి .ఇద్దరు మాజీ ఎయిర్ కెనడా ఉద్యోగులు ఈ దొంగతనంలో సహాయపడినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.వారిలో ఒకరు ఇప్పుడు పోలీసుల అదుపులో వుండగా.
మరొకరిపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.ఆరోజున 6600 బార్‌ల 9999 శాతం స్వచ్ఛమైన బంగారం 400 కిలోగ్రాములు.20 మిలియన్ కెనడా డాలర్లు, 5 మిలియన్ల విదేశీ కరెన్సీని ఎయిర్‌పోర్ట్‌లోని ప్రత్యేక ప్రదేశానికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.