ఏపీలో ఎన్నికల పోలింగ్( AP Polling ) సమయంలో చోటు చేసుకున్న ఘర్షణలపై ఈసీ ( EC ) తీవ్రంగా మండిపడింది.ఈ క్రమంలోనే తెనాలి, మాచర్ల, అనంతపురం ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
అదేవిధంగా పుంగనూరులో( Punganuru ) నిందితులను వదిలేసిన ఎస్ఐపై ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది.
అనంతరం పోలింగ్ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో రెండు గంటలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.
కాగా ఏపీలో అల్లర్లపై టీడీపీ,( TDP ) బీజేపీ( BJP ) నేతలు ఈసీకి ఫిర్యాదు చేశాయి.ఈ క్రమంలోనే ఎన్డీఏ అభ్యర్థులు, కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడికి పాల్పడుతున్నారని బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది.