ప్రస్తుత వేసవి కాలంలో అధిక ఎండల కారణంగా చర్మం నల్లగా, కాంతిహీనంగా మారడం సర్వసాధారణం.అయితే ఎండల వల్ల చర్మమే కాదు కొందరికి పెదాలు కూడా నల్లగా మారుతుంటాయి.
దాంతో తెగ హైరానా పడిపోతుంటారు.పెదాల నలుపు ని ఎలా వదిలించుకోవాలో తెలియక సతమతం అవుతుంటారు.
మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే టిప్స్ మీకు ఎంతో బాగా సహాయపడతాయి.ఈ టిప్స్ ను పాటిస్తే సులభంగా పెదాల నలుపును వదిలించుకోవచ్చు.లిప్స్ ను గులాబీ రంగులో మెరిపించుకోవచ్చు.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ బీట్ రూట్(Beet root) పౌడర్ వేసుకోవాలి.అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్(sugar) పౌడర్ మరియు రెండు టేబుల్ స్పూన్లు తేనె(honey) వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని పెదాలకు అప్లై చేసుకుని సున్నితంగా రెండు నిమిషాల పాటు స్క్రబ్బింగ్ చేసుకోవాలి.స్క్రబ్బింగ్ అనంతరం మరో ఐదు నిమిషాల పాటు పెదాలను ఆరపెట్టుకొని అప్పుడు వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
రోజుకు ఒకసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే పెదాలపై మురికి, మృతకణాలు తొలగిపోతాయి.నల్లగా మారిన పెదాలు గులాబీ రంగులోకి మారతాయి.
బాదం నూనె పెదాల నలుపును వదిలించడానికి చాలా బాగా సహాయపడుతుంది.రోజు నైట్ నిద్రించే ముందు బాదం నూనెను (Almond oil)పెదాలకు అప్లై చేసి మసాజ్ చేసుకోవాలి.నిత్యం ఇలా చేశారంటే మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.అలాగే ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్లు పాలు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని పెదాలకు పూతలా అప్లై చేసుకుని పది నిమిషాల తర్వాత వాటర్ తో కడిగేయాలి.ఈ సింపుల్ రెమెడీని పాటించినా నలుపు పోయి పదాలు అందంగా మారుతాయి.
ఇక దానిమ్మ(Pomegranate) తో కూడా డార్క్ లిప్స్ కి బై బై చెప్పవచ్చు.అందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ పెరుగు మీగడ(Yogurt), రెండు టేబుల్ స్పూన్లు దానిమ్మ రసం వేసి మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని పెదాలకు అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.పది నిమిషాలు అనంతరం వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.ఇలా చేసినా కూడా నల్లగా ఉన్న మీ పెదాలు గులాబీ రంగులోకి మారతాయి.మృదువుగా మెరుస్తాయి.