అమెరికాలో ఖరీదైన కార్లు రోడ్లపై తిరగడం అసాధారమేమీ కాదు.కానీ, పోలీస్ వాళ్లు వాటిని వాడటం మాత్రం చాలా అరుదు.
అయితే తాజాగా అలాంటి అరుదైన ఘటన మయామి బీచ్‌లో(Miami Beach) జరిగింది.అక్కడి పోలీస్ డిపార్ట్మెంట్ కొత్త పెట్రోల్ కారుగా ఏకంగా రోల్స్ రాయిస్(Rolls Royce) ని పరిచయం చేసింది! ఈ కోటి రూపాయల విలువైన లగ్జరీ కారు ఇప్పుడు వాళ్ల పెట్రోలింగ్ వాహనాలలో చేరిపోయింది.
పోలీసు శాఖ బ్రేమన్ మోటార్స్ అనే కారు కంపెనీతో కలిసి పనిచేసి, ఈ కారును తీసుకొచ్చుకుంది.పోలీస్ టీమ్‌లో ఎక్కువ మంది చేరేలా ఆకర్షించడానికే దీనిని వాడబోతోంది.
పోలీసు శాఖ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది.అది దావానలంలా వ్యాపిస్తోంది ఆ వీడియోలో బ్లాక్, ఖరీదైన రోల్స్ రాయిస్ రోడ్డుపై వెళుతుండగా, దాని చుట్టూ మోటార్‌బైక్ పోలీసులు కనిపిస్తారు.
ఈ కారు అందమైన డిజైన్ చాలా మందిని ఆకర్షించింది. మయామి పోలీస్ డిపార్ట్మెంట్ తమ కొత్త పోలీస్ సిబ్బందిని పెంచే ప్రయత్నాలలో ఈ కారు చేరిక పట్ల గర్వంగా ఉందని, అది అధిక ప్రమాణాలు, సమాజానికి వారు చేసే కమిట్మెంట్కు చిహ్నమని చెప్పారు.
ఈ వీడియో చాలా ఫేమస్ అయింది, 322,000 కి పైగా వ్యూస్ వచ్చాయి.పోలీసు శాఖలో ఇంత ఖరీదైన కారును చూసి సోషల్ మీడియా యూజర్లు ఆశ్చర్యపోయారు.కొంతమంది చిన్న చిన్న నేరాలు చేసి ఆ రోల్స్ రాయిస్ (Rolls Royce)లో ఒకసారి ప్రయాణించాలని సరదాగా మాట్లాడారు.మరికొందరు ఈ వీడియోను ఉపయోగించుకుని పోలీసు శాఖలకు కేటాయించే నిధుల గురించి ప్రశ్నించారు.
ఇలాంటి సంఘటనే కొన్నేళ్ల క్రితం అబుధాబిలో జరిగింది.అక్కడ ఒక లాంబోర్ఘిని అవెంటడార్ కూపే కారును అంతర్గత మంత్రిత్వ శాఖ లగ్జరీ వెహికల్స్‌లో చేర్చారు.ఈ సూపర్‌కార్‌ను ప్రచారంలో భాగంగా ఏడు ఎమిరేట్స్‌లో ప్రదర్శించారు.అధికార పాత్రల్లో హై-ఎండ్ కార్లను ఉపయోగించే ధోరణి మరింత పెరిగింది.