కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా( Amit Shah ) వీడియో మార్ఫింగ్ కేసులో నిందితులకు బెయిల్( Bail ) మంజూరైంది.ఈ మేరకు తెలంగాణ పీసీసీ సోషల్ మీడియా( Telangana PCC Social Media ) సభ్యులకు కోర్టు బెయిల్ ఇచ్చింది.
ఇటీవల కేసులో అరెస్ట్ అయిన వంశీ కృష్ణ, మన్నె సతీశ్, నవీన్, ఆస్మా తస్లీమ్ మరియు గీతకు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.రూ.20 వేల పూచికత్తు సమర్పించాలని ఆదేశాలు ఇచ్చింది.
కేసులో తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు సోమ మరియు శుక్రవారాల్లో ఇన్వెస్టిగేటివ్ అధికారుల ముందు హాజరు కావాలని ఆదేశించింది.
అయితే రిజర్వేషన్లు( Reservations ) రద్దు చేస్తారంటూ అమిత్ షా పేరిట ఓ ఫేక్ వీడియోను కాంగ్రెస్( Congress ) వైరల్ చేసిందన్న ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో బీజేపీ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కేసుపై దర్యాప్తును ముమ్మరంగా సాగిస్తున్నారు.