సినిమా ఇండస్ట్రీలో రానించాలంటే ఎవరికైనా కూడా ఎంత అదృష్ట ఉంటుందో ఎంత నటన వచ్చినా కూడా అంతే కాన్ఫిడెన్స్ గా ఉండడం చాలా ముఖ్యం.ఏదో మీడియా కనిపించినప్పుడు హడావిడి చేస్తే సరిపోదు వారి మెయింటెనెన్స్ కూడా అదే రేంజ్ ఉండాలి.
ప్రతిసారి సూపర్ అట్టైర్స్ వేయడం మాత్రమే కాదు.అందుకు తగ్గట్టు హావాభావాలు మెచ్యూరిటీ రావడం కూడా చాలా ముఖ్యం.
అయితే ప్రస్తుతం టాలీవుడ్ , బాలీవుడ్ అనే తేడా లేకుండా ఒక ఇద్దరు హీరోయిన్స్( Heroines ) ఈ తరహా బిహేవియర్ నీ చాలా కొత్తగా అలవాటు చేసుకుని వారికి నచ్చిన రూట్ లో ముందుకు వెళుతున్నారు.మరి ఆ ఇద్దరు హీరోయిన్స్ ఎవరు ? ఇప్పుడు వాళ్ళు ఇంత త్వరగా ఎందుకు మారారు అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
నయనతార
నయనతార( Nayanthara ) రూటే సపరేటు.ఆమె మొదటి నుంచి తనదైనా స్టైల్ లోనే తన డ్రెస్సింగ్, కాస్ట్యూమ్స్( Dressing, costumes ) అన్ని చూసుకుంటూ ఉంటారు.మొదట్లో అసలు ఏ ఈవెంట్ కి కూడా హాజరయ్యే వారు కాదు.సినిమా ప్రమోషన్స్ అంటే చాలా దూరంగా ఉండేవారు.కానీ నయన్ లో చాలా మార్పు వచ్చింది ఆమె ఇప్పుడు పేజీ 3 ఈవెంట్స్ కి అడప దడపా కనిపిస్తూనే ఉంది.ఇక ఆమె ఏ ఈవెంట్ కి వచ్చినా కూడా వేసుకునే డ్రెస్సింగ్ స్టైల్ చాలా భిన్నంగా ఉంటుంది మిగతా హీరోయిన్స్ ల కంఫర్ట్ లేని బట్టలు అస్సలు వేయదు కుదిరితే చీరల్లో ఎంతో అందంగా హుందాగా ఉండడానికి ప్రయత్నిస్తుంది.
లేదంటే సరదాగా వేసే జీన్స్ షర్ట్స్ ని ధరిస్తూ కనిపిస్తుంది.పైగా మీడియాతో చాలా హుందాగా మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తుంది మరి ఈ మెచ్యూరిటీ రావడానికి నయన్ కి చాలా టైం పట్టింది.
రష్మిక మందన్న
కన్నడ నుంచి తెలుగుకు ఇంపార్ట్ అయిన హీరోయిన్ రష్మిక మందన( Rashmika Mandana ) .అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి రష్మిక కి పెద్ద చేంజ్ అలాగే మేకవర్ లో ఎలాంటి తేడా అవసరం పడలేదు.కానీ ఒక్కసారి బాలీవుడ్ కి వెళ్ళగానే రష్మికలో చాలా మార్పు వచ్చింది.అక్కడికి వెళ్లిన తొలినాలలో బట్టలు వేసుకున్న ఈవెంట్స్ లో మీడియా ముందు మాట్లాడాల్సి వచ్చిన అస్సలు కంఫర్ట్ గా ఫీల్ అయ్యేది కాదు.
కానీ ఇప్పుడు ఆమె పూర్తిగా మారిపోయింది.చాలా కాన్ఫిడెంట్ గా మీడియా ముందు తనదైన డ్రెస్సింగ్ స్టైల్ తో సిగ్నేచర్ మూమెంట్స్ తో కనిపిస్తుంది.మొత్తానికి బాలీవుడ్ రష్మిక మందనకు చాలానే నేర్పించింది.