నయనతార( Nayanthara ) ఈమె ఒక ఐటమ్ బాంబ్.సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నయనతార కెరియర్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మొదటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది.
కెరియర్ తొలినాల్లలో ఆమె చాలా కోపంగా కనిపిస్తూ ఉండేది.షూటింగ్ సెట్స్ లో ఈమె వచ్చిందంటే చాలు మిగతా వారంతా అలర్ట్ అయిపోయే పరిస్థితులు ఉండేవి నయనతార కోపం వచ్చిందంటే ఇంకా ఆరోజు అంతే సంగతులు.
అసలు ఎవరు చెప్పినా ఓ పట్టాన వినదు అలాంటి నయనతార ఇప్పుడు చాలా శాంతమూర్తిగా మారిపోయింది.ఆమె తీస్తున్న సినిమా విషయంలో అలాగే జీవితంలో కూడా నయనతార కాస్త మారిపోయినట్టుగానే కనిపిస్తుంది.
మరి ఇంత మార్పుకి కారణాలు ఏంటి అనే విషయాన్ని విశ్లేషించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది.
కేవలం మార్పులోనే కాదు ఆమె ధరించే బట్టల్లో కూడా చాలా తేడా వచ్చింది.కాస్ట్యూమ్స్ ( Costumes )పరంగా మెచ్యూరిటీ కనిపిస్తుంది.అలాగే ఆమె అసలు ఎలాంటి ప్రమోషన్ ఈవెంట్స్ కి వచ్చేది కాదు.
కానీ ఇప్పుడు పేజ్ 3 ఈవెంట్స్ అటెండ్ అవుతూ కూడా కనిపిస్తుంది ఇద్దరు పిల్లల తల్లి అయిన తర్వాత ఆమెలో ఈ మార్పు రావడం విశేషం.ఇలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన కారణంగా తనతో చనువు గా ప్రవర్తించే వారు ఏదైనా తప్పుగా అంటారేమో అని భయంతో అలా ఎప్పుడూ నిప్పులు తొక్కిన మనిషిలా కనిపించేది.
అందుకే కుదిరినంత కఠినంగా ప్రవర్తించడానికి మొగ్గు చూపింది.ఇక ఇప్పుడు ఆమె మీడియాతో మాట్లాడే పద్ధతి కూడా చాలా మారింది.ఎప్పుడూ కట్టె విరిచినట్టుగా మాట్లాడే నయనతార చాలా ఓపికగా సమాధానాలు చెబుతుంది.
ఆమె సినిమాలు( Movies ) మాత్రమే కాదు ఎలాంటి విషయాన్ని అయినా కూడా మీడియాతో మాట్లాడడానికి ఇష్టపడేది కాదు.కానీ ఇప్పుడు ప్రతి సంఘటనకు వివరణలు కూడా ఇస్తుంది.మరి ఇంత మార్పుకి కారణం కేవలం తన వయసుతో పాటు పరిణతి కూడా పెరగడం, పైగా ఇప్పుడు తల్లి తర్వాత బాధ్యతలు పెరగడం, ఎవరి జీవితం అయినా ఎలా ఉంటుందో ఒక స్థాయికి వచ్చిన తర్వాతే అర్థమవుతుంది.
పైగా తనను అర్థం చేసుకునే వ్యక్తి తనతో ఉన్నప్పుడు ఎవరి గురించి బాధపడాల్సిన, భయపడాల్సిన అవసరం కూడా ఆమెకు లేదు కదా.