జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పర్యటించే హెలికాప్టర్ లో సాంకేతిక లోపం తలెత్తింది.సరిగ్గా టేక్ ఆఫ్ సమయంలో ఇంజన్ లో సమస్య ఏర్పడింది.
దీంతో అప్రమత్తమైన పైలట్ ప్రయాణానికి విముఖత వ్యక్తం చేశారు.ఈ పరిణామంతో తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు వాయిదా పడ్డాయి.
పిఠాపురం నుంచి తాడేపల్లిగూడెం( Tadepalligudem from Pithapuram ) బయలుదేరే సమయంలో… చివరి నిమిషంలో హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య ఏర్పడటంతో.తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలను వాయిదా వేస్తున్నట్లు జనసేన పార్టీ ప్రకటన విడుదల చేయడం జరిగింది.
ఇదే సమయంలో త్వరలో ఆ నియోజకవర్గాలలో పవన్ పర్యటిస్తారని పేర్కొనడం జరిగింది.
ఎన్నికల నేపథ్యంలో పవన్ పర్యటనకు ఆటంకం రావటంతో పార్టీ క్యాడర్ ఆందోళనకు గురి కావడం జరిగింది.గతంలోనూ పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తేయి.మళ్లీ అదే సమస్య.తలెత్తడంతో… పవన్ భద్రత విషయంలో పార్టీ క్యాడర్ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.ఈసారి కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.కచ్చితంగా గెలవాలని అభిమానులు పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు.2019 ఎన్నికలలో భీమవరం, గాజువాక నుండి పోటీ చేసి ఓడిపోయారు.మే 13న ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి.ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ జరుగుతుంది.ఈసారి బీజేపీ, టీడీపీ, జనసేన( BJP, TDP, Jana Sena ) మూడు పార్టీలు కలసి కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి.పవన్ రాష్ట్రవ్యాప్తంగా వారాహి విజయభేరి యాత్రలు నిర్వహి స్తున్నారు.
ఈ సందర్భంగా కూటమి తరపున పోటీ చేసే అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటంతో హెలికాప్టర్ వినియోగించడం జరిగింది.
ఈ క్రమంలో సోమవారం సాంకేతిక సమస్యలు తలెత్తడంతో.పవన్ సోమవారం ఎన్నికల ప్రచార కార్యక్రమాలు వాయిదా పడ్డాయి.